
న్యాచురల్ స్టార్ నాని సినిమాకు విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించే అవకాశముందా? ఇది ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికరంగా మారిన చర్చ. కాకినాడలో స్థిరపడిన విజయ్ బుల్గానిన్, సంగీతంపై ఉన్న అభిరుచితో ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు. అతన్ని పరిచయం చేసిన SKN, సాయి రాజేష్, బేబీ సినిమా ద్వారా అతనికి బ్రేక్ ఇచ్చారు. ఈ చిత్రంలో “ఓ రెండు ప్రేమ మేఘాలిలా” పాట ఘనవిజయం సాధించి సంగీత దర్శకుడిగా విజయ్‌కి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది.
బేబీ తర్వాత, నాని నిర్మించిన కోర్ట్ సినిమాకు సంగీతాన్ని అందించిన విజయ్, మెలోడీ పాటలతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కోర్ట్‌లో అతని మ్యూజిక్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయడంతో, నాని ఆయనపై ఆసక్తి కనబరుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలెంట్‌ను ప్రోత్సహించడంలో నాని ముందుంటాడు, అందుకే విజయ్ బుల్గానిన్‌ను తన రాబోయే చిత్రంలో అవకాశం కల్పించే అవకాశముందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం నాని చేస్తున్న ప్రాజెక్టులకుగాను మ్యూజిక్ డైరెక్టర్లు ఇప్పటికే ఖరారైనప్పటికీ, రాబోయే సినిమాల్లో విజయ్‌కి అవకాశం దక్కుతుందేమో చూడాలి. హిట్ 3 విడుదలకు సిద్ధంగా ఉండగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఆ తర్వాత నాని ఏ ప్రాజెక్ట్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. విజయ్ బుల్గానిన్, నాని కాంబో సెట్ అయితే, సంగీత ప్రియులకోసం మరో మ్యూజికల్ హిట్ ఖాయమని చెప్పొచ్చు.
Recent Random Post:















