నాని హీరోగా హిట్3, అడివి శేష్ కీలక పాత్రలో సర్‌ప్రైజ్

Share


నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న మూడో భాగం “హిట్ ది థ‌ర్డ్ కేస్” సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్పడుతున్నాయి. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నాని త‌న సొంత బ్యాన‌ర్ “వాల్ పోస్ట‌ర్ సినిమాస్” పై నిర్మిస్తున్నారు. శ్రీనిథి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమా మే 1 న ప్రేక్షకుల ముందుకు రానున్న‌ట్లు మేకర్స్ వెల్లడించారు.

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఆడియ‌న్స్ నుండి మంచి ఆద‌ర‌ణ పొందిన “హిట్” ఫ్రాంచైజ్ సిరీస్ లో మూడో భాగం ఏంటి అని ప్రేక్షకులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న హిట్3పై అంద‌రికీ భారీ అంచ‌నాలే ఉన్నాయి. దీనిని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న నాని, ఈ సినిమాలో అర్జున్ స‌ర్కార్ అనే ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడు.

హిట్ ఫ్రాంచైజ్‌లో హిట్ ది ఫ‌స్ట్ కేస్‌లో విశ్వ‌క్ సేన్, హిట్ ది సెకండ్ కేస్‌లో అడివి శేష్ నటించగా, ఇప్పుడు హిట్ ది థ‌ర్డ్ కేస్‌లో నాని ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో, అడివి శేష్ కీల‌క పాత్ర‌లో కనిపించనున్నట్టు తాజా సమాచారం అందింది. హిట్3లో అడివి శేష్ పాత్ర ఆడియ‌న్స్‌కు సర్‌ప్రైజ్ అండ్ థ్రిల్‌ను ఇస్తుంద‌ని తెలుస్తోంది.

నేచుర‌ల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్3 షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతుండ‌గా, అత‌డు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో “ది ప్యార‌డైజ్” అనే కొత్త చిత్రం కూడా చేస్తున్నాడు. సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా క‌థ సరికొత్తగా ఉండ‌నుందని సమాచారం. “ద‌స‌రా” సినిమా సూపర్ హిట్ కావడంతో, “ది ప్యార‌డైజ్” పై కూడా మంచి అంచ‌నాలు ఉన్నాయి.


Recent Random Post: