
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా చేస్తున్న ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాల్ పోస్టర్ సినిమా సంస్థను స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చూడలేదు. తొలిసారి ‘డీ ఫర్ దోపీడి’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించి, నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో నానికి నిర్మాతగా మంచి ఊతం లభించింది.
అయితే, వాస్తవానికి నాని నిర్మాతగా తన అసలైన ముద్ర వేశింది ‘అ’ సినిమాతోనే. ఈ ప్రయోగాత్మక చిత్రానికి ఘనమైన ప్రశంసలు దక్కినా, వాణిజ్య పరంగా అద్భుతమైన ఫలితాలు రాలేదు. అయితే, ఈ సినిమా ద్వారా టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆ తర్వాత ‘హిట్: ది ఫస్ట్ కేస్’ సినిమాతో మరోసారి నిర్మాతగా తన స్థాయిని పెంచుకున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో, దాని ప్రాంఛైజీని కొనసాగించేందుకు నాని ముందుకొచ్చాడు.
‘హిట్: ది సెకండ్ కేస్’ కూడా మంచి విజయాన్ని సాధించడంతో వాల్ పోస్టర్ సంస్థ మరింత బలపడింది. ఇక ఇటీవల విడుదలైన ‘హాయ్ నాన్న’ భారీ వసూళ్లను రాబట్టింది. వాల్ పోస్టర్ సంస్థ నుంచి వచ్చిన ఈ సినిమా, ఈ బ్యానర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది.
ప్రస్తుతం నాని ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరోగా నటిస్తూనే, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే, నిర్మాతగా నానికి డబుల్ హ్యాట్రిక్ పూర్తవుతుంది. ఇది మీడియం రేంజ్ హీరోల్లో ఇంతవరకు ఎవరూ చేయని అద్భుతమైన ఫీట్. స్టార్ హీరోల్లో కూడా ఇలాంటి విజయవంతమైన నిర్మాణ ప్రయాణం చూపించగలిగిన వారు అరుదే.
ఈ సినిమాల మధ్యలోనే నాని ‘మీట్ క్యూట్’ అనే వెబ్ సిరీస్‌ను కూడా నిర్మించాడు. అయితే, అది ఓటీటీ విడుదలైన ప్రాజెక్ట్ కావడంతో, ప్రధానంగా థియేట్రికల్ విజయాలను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి.
ఇలా చూస్తే, హీరోగానే కాదు, నిర్మాతగానూ నాని తనదైన శైలిలో విజయాలను అందుకుంటూ, కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు.
Recent Random Post:















