పవన్ కళ్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు

Share


టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మరోసారి తీవ్రమైన విమర్శలు చేశారు నటుడు ప్రకాష్ రాజ్. ఇప్పటికే పలుమార్లు పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, తాజాగా హరిహర వీరమల్లు సక్సెస్ మీట్‌లో పవన్ చెప్పిన మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

హరిహర వీరమల్లు సక్సెస్ మీట్‌లో పవన్, అభిమానులకు “సోషల్ మీడియాలో ట్రోల్స్‌కి గట్టి సమాధానం ఇవ్వాలి” అని చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన ప్రకాష్ రాజ్, “మనసాక్షి లేని ఇలాంటి దొంగల గురించి ఏమి మాట్లాడాలి? ప్రేక్షకులకు సినిమా అనేది ఎమోషన్, బంధం. కానీ ఇలా చెత్త సినిమాలు తీసి ఎవరికీ అమ్ముతున్నారు? హరిహర వీరమల్లు, కన్నప్ప, గేమ్ ఛేంజర్, థగ్ లైఫ్ వంటి సినిమాల్లో క్వాలిటీ లేకపోయినా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో పెద్ద ఎత్తున ఎలివేషన్స్ ఇస్తున్నారు. రాజమౌళి బాహుబలి లాగా ట్రెండ్ సెట్ చేశామని అనుకుంటున్నారా? ఇది ప్రజలను మోసం చేయడం కాదా?” అంటూ ప్రశ్నించారు.

“వీరమల్లు సినిమా ఐదేళ్లు ఎందుకు ఆలస్యమైంది? కథ ఉందా? నిజాయితీ ఉందా? నిర్మాతకు మీరు ద్రోహం చేశారు. వడ్డీలు పెరిగాయి, కథలు మార్చేశారు. రాజకీయ సిద్ధాంతాలు రుద్దుతూ సినిమా తీయాలని చూశారు. ఐదేళ్లు కష్టపడ్డామని చెప్పుకుంటున్నారు కానీ పది రోజులు షూటింగ్‌కి వచ్చి ఉంటే సినిమా చాలా కాలం క్రితమే పూర్తయ్యేది” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

అలాగే, “మాకే మోసం చేశారని పవన్ కళ్యాణ్ అభిమానులు బాధపడుతున్నారు. స్పీచ్‌లో మాటలు ఒకలా, పనులు మరొకలా. గతంలో మహేశ్ బాబు, ఎన్టీఆర్‌తో కలిసి ‘అందరం కలసి ఉండాలి’ అన్నారు. ఇప్పుడు మాత్రం తిరిగి కొట్టమంటున్నారు. సైనికులమంటున్నారు. ఫ్యాన్స్ బాడీ పార్ట్స్ తప్ప ఇంకేం ఆలోచించడం లేదు. ఇది మనసాక్షి కాదు, నాన్సెన్స్. జనాలు మూర్ఖులు కాదు. మోదీ బయోపిక్ వచ్చినా 100 మంది కూడా చూడలేదు” అని ఎద్దేవా చేశారు.

“సినిమా బాగోలేదని ఫ్యాన్సే చెబుతున్నారు. ట్రోల్ చేస్తే ట్రోల్ చేయమని ప్రోత్సహిస్తున్నారు. ఇది కోపం కాదు, ఆవేదన. సోమరితనం, అహంకారం వల్ల సినిమా ఐదేళ్లు ఆలస్యమైంది. నిజాయితీ ఉండాలి. డైరెక్టర్‌కి అవసరమైన వాతావరణం కల్పించారా? పాలిటిక్స్ వేరు, సినిమాలు వేరు. నిన్ను ప్రేమించిన వాళ్లను ఇలా మోసం చేయడం తప్పు” అని ప్రకాష్ రాజ్ తేల్చి చెప్పారు.


Recent Random Post: