పవన్–మోహన్ రాజా కాంబో? మెగా ఫ్యాన్స్‌లో మిక్స్‌డ్ టాక్

Share


పవర్ స్టార్ Pawan Kalyan తన తదుపరి సినిమాను ‘గాడ్ ఫాదర్’ దర్శకుడు Mohan Rajaతో చేసే అవకాశమున్నట్టు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగినట్లు, పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

మోహన్ రాజా, Chiranjeeviతో చేసిన Godfather సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడం తెలిసిందే. Lucifer రీమేక్ అయినప్పటికీ, తెలుగు ఆడియన్స్‌ను పూర్తిగా ఆకట్టుకోవడంలో కొంత వెనుకబడింది.

ఆ తర్వాత Ram Charanతో సినిమా చేయాలనుకున్నా అది సాధ్యపడలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే దిశగా అడుగులు వేయడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పవన్ Ustaad Bhagat Singh విడుదలకు సిద్ధమవుతుండగా, మోహన్ రాజా పక్కా స్క్రిప్ట్‌తో ఆయనను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఈ ప్రాజెక్ట్ రీమేక్ అవుతుందా లేక స్ట్రెయిట్ స్టోరీనా అన్నది ఇంకా క్లారిటీ లేదు. మెగా అభిమానుల్లో ఈ కాంబినేషన్‌పై మిక్స్‌డ్ రియాక్షన్ కనిపిస్తోంది. కొందరు పవన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మోహన్ రాజా హ్యాండిల్ చేయగలరా అని సందేహపడుతుంటే, మరికొందరు ఆయన స్టైల్ కొత్తగా ఉంటుందని భావిస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ షెడ్యూల్స్ మధ్య ఈ సినిమాకు డేట్స్ ఎలా కేటాయిస్తారు అన్నది కూడా ఒక కీలక అంశం. అన్ని అనుకూలిస్తే ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

మొత్తానికి, అన్నయ్యతో పెద్ద సక్సెస్ అందుకోలేకపోయిన మోహన్ రాజా, తమ్ముడితోనైనా బ్లాక్‌బస్టర్ కొడతాడా అన్నది ఆసక్తిగా మారింది. ఈ క్రేజీ కాంబినేషన్ నిజంగా సెట్స్ పైకి వెళ్తుందా లేదా అనేది త్వరలోనే తేలనుంది.


Recent Random Post: