
పూజా హెగ్డే కోలీవుడ్‌లో తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ‘రెట్రో’ సినిమా ద్వారా మళ్లీ రీ-లాంచ్ అయినా, ఆ చిత్రం ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. ఘనంగా తిరిగి రావాలన్న ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న ‘జననాయకన్’ చిత్రంలో ఆమె భాగమవుతోంది, ఇందులో ఆమె పాత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇక ఇప్పుడు ఆమె ‘కాంచన 4’ షూటింగ్లో పాల్గొంటోంది.
ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అయితే, పూజా తమిళనాట ఖాళీ అవుతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో కొత్త సినిమాలేవీ లేవు. రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’లో మాత్రం ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ పరిస్థితుల్లో పూజా టాలీవుడ్ వైపు మళ్లి చూస్తోంది. తిరిగి అవకాశాల కోసం పాత పరిచయాలను మళ్లీ చురుగ్గా టచ్‌లోకి తీసుకొస్తోందట.
తనకు ఇంతకుముందు మేనేజ్మెంట్ చూసిన వ్యక్తులను సంప్రదించి, ఇండస్ట్రీ పరిస్థితులు, ట్రెండ్స్ గురించి తెలుసుకుంటోందని సమాచారం. కొన్ని ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్‌ను కూడా కలిసిందని అంటున్నారు. ఈ పాత పరిచయాలు ఆమెకు కొత్త అవకాశాలుగా మారతాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
పూజా హెగ్డేకు ‘ఆచార్య’ తర్వాత తెలుగులో సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ, ఆమె వాటిని వదిలేసి బాలీవుడ్ ప్రయాణం ఎంచుకుంది. కానీ అక్కడ ఆశించిన స్థిరత దక్కలేదు. వెంటనే కోలీవుడ్‌కు మారిపోయింది. ప్రస్తుతం కొన్ని తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నా, ఈ సినిమాల విజయంపై ఆధారపడి ఆమె కెరీర్ నడవాల్సి ఉంది. లేకపోతే రిటైర్మెంట్ గాసిప్స్ మళ్లీ జోరందుకోవడం ఖాయం.
Recent Random Post:















