మలైకా అరోరా- అర్జున్ కపూర్ జంట, ప్రేమాయణం మరియు బ్రేకప్ విషయాల గురించి గత కొంత కాలంగా మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ జంట మధ్య బ్రేకప్ సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి సింగిల్‌గా ఉన్నట్టు అర్జున్ గాతంలో ప్రకటించాడు. మలైకా నుండి విడిపోయిన తర్వాత, అతను తన వివాహ ప్రణాళికలను తాజాగా పంచుకున్నాడు.
తన సినిమా “మేరే హస్బెండ్ కి బివి” ప్రచారంలో భాగంగా అర్జున్ రియల్ లైఫ్ పెళ్లి గురించి ఓపెన్ అయ్యాడు. “పెళ్లి ఎప్పుడు జరుగుతుందో, అది నేను మీతో పంచుకుంటా. ఈ రోజు సినిమాపైనే మాట్లాడుకుందాం” అని అర్జున్ వ్యాఖ్యానించాడు. తన వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రస్తుతం మాట్లాడడం లేదు, ఎప్పుడైతే సరైన సమయం వస్తుందో, అప్పుడే పెళ్లి విషయాన్ని పంచుకుంటానని కూడా అన్నాడు.
కొంతకాలం క్రితం, అర్జున్ మలైకా అరోరాతో విడిపోయినట్లు వెల్లడించాడు. రాజ్ థాకరే నిర్వహించిన దీపావళి పార్టీలో ఒంటరిగా ఉన్నానని అర్జున్ పేర్కొన్నాడు. ఈ వార్త జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. “మేరే హస్బెండ్ కి బివి” పోస్టర్‌లు కూడా వైరల్ అయ్యాయి. ఈ చిత్రంలో అర్జున్, భూమి పెడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 2025 ఫిబ్రవరి 21న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శక్తి కపూర్, అనితా రాజ్, డినో మోరియా, ఆదిత్య సీల్ సహాయ పాత్రల్లో నటించారు.
Recent Random Post: