పెళ్లి చేసుకోవాలని ఉంది.. మీరిలా పుకార్లు పుట్టిస్తే ఎలా?

గ్లామర్ హీరోయిన్ కు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ అంటే.. అస్సలు మ్యాచ్ కాదనేస్తారు. మరి.. బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా మాటేమిటి? అన్నంతనే.. నిజమే కదా? అన్న మాట నోటి నుంచి వచ్చేస్తుంది. తన మాటలతో.. చేతలతో.. తరచూ వార్తల్లో నిలిచే కంగనా వివాదాల్ని అస్సలు లెక్క చేయని వైనం తెలిసిందే. నిత్యం సంచలనాలతో సహవాసం చేసే ఆమె.. తాను చెప్పాల్సిన విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పేస్తారు. ఆమె ఎవరినైనా టార్గెట్ చేస్తే.. వారెంత అగ్ర హీరో అయినా సరే ఆమె దెబ్బకు దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఆమెతో పెట్టుకుంటే ఎంతటి వారైనా సరే.. చుక్కలు కనిపించాలన్నట్లుగా ఆమె నోటి నుంచి తాజాగా పెళ్లి మాటలు రావటం ఆసక్తికరంగా మారింది.

అంతేకాదు.. తనను టామ్ బాయ్ గా పిలవటం.. తాను ఇతరులపై చేయి చేసుకుంటానంటూ పుకార్లు పుట్టిస్తే నాకిక పెళ్లి ఎలా అవుతుంది? చెప్పండంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా తాజాగా పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కంగనా. థాకడ్ సినిమాలో మాదిరి రియల్ లైఫ్ లో టామ్ బాయ్ లా ఎందుకు ఉంటాను చెప్పండి? అంటున్న ఆమె.. తనకున్న పెళ్లి ఆలోచనల్ని బయటపెట్టారు.

ప్రస్తుతం ఆమె నిర్మించిన టీకూ వెడ్స్ షేరు మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. నవాజుద్దీన్ సిద్ధిఖి.. అవనీత్ కౌర్ జంటగా నటిస్తున్న ఈ మూవీకి ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 23న విడుదల కానుంది. మరోవైపు దివంగత ప్రధాని ఇందిర పాత్రను పోషిస్తున్న మూవీతో పాటు మరికొన్ని సినిమాల్ని చేస్తోంది. తనకు పెళ్లి చేసుుకోవాలని ఉందన్న ఆమె.. ”నాకు పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. నాకంటూ సొంత కుటుంబాన్ని ఏర్పర్చుకోవాలని ఉంది. కానీ.. నేను తొందరపడితే అది జరగదు. ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే జరిగి తీరుంది” అంటూ ఆమె నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.


Recent Random Post: