
టాలీవుడ్లో అత్యంత పొడవైన, భారీ శరీరాకృతితో పేరున్న హీరోలలో ప్రభాస్ ముందువరుసలో ఉంటాడు. అతనితో సమానం చేసే నటులు తక్కువే. అయితే, తన బాడీ బిల్డింగ్‌తో ప్రభాస్‌ను డామినేట్ చేసినట్లు చెబుతున్నాడు మంచు విష్ణు. ‘కన్నప్ప’ సినిమా కోసం విష్ణు ఎంతో కష్టపడి ఫిట్నెస్ పెంచుకున్నాడు. ఇటీవల విడుదలైన పాటల్లో అతని మాస్ లుక్, ముసులాయి కండలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
అయితే, విష్ణు ఎంత బాడీ బిల్డింగ్ చేసినా ప్రభాస్ ముందు తగ్గుతాడనిపించవచ్చు. కానీ స్వయంగా ప్రభాస్ మాత్రం విష్ణును చూసి, “నీలో నేను సగం ఉన్నా” అంటూ సరదాగా వ్యాఖ్యానించాడని విష్ణు వెల్లడించాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేసిన విష్ణు, “ప్రభాస్ చాలా సన్నబడిపోయాడు. ‘కన్నప్ప’ షూటింగ్‌కు వచ్చినప్పుడు కూడా తక్కువ బరువుతో కనిపించాడు. అందుకే, స్లీవ్‌లెస్ డ్రెస్ వేసుకోమంటే ఆయన అంగీకరించలేదు” అని చెప్పాడు.
ఇక సోషల్ మీడియాలో పెరిగిపోతున్న నెగెటివిటీపై స్పందిస్తూ, “ప్రభాస్‌కి కన్నప్ప సినిమా కోసం పారితోషికం ఇవ్వకపోతే చంపేస్తానని ఒక నెటిజన్ బెదిరించాడు” అని చెప్పడం విశేషం. అయితే, ప్రభాస్‌తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ లాంటి వారు కూడా తమ అభిమానంతోనే ‘కన్నప్ప’లో నటించారని విష్ణు స్పష్టం చేశాడు.
Recent Random Post:















