
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న “ది రాజాసాబ్” సినిమా శరవేగంగా పూర్తి దశకు చేరుకుంటోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో తాజా షెడ్యూల్ జరుగుతుండగా, ఇందులో ప్రభాస్‌తో పాటు వీటీవీ గణేష్ కూడా పాల్గొంటున్నారు. వీరిద్దరి మధ్య సాగుతున్న హాస్య సన్నివేశాలు ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఇప్పటికే సినిమాలోని మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తవగా, ఫైనల్ షెడ్యూల్ లో భాగంగా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ కెరీర్ ఆరంభంలో వినోదాత్మక పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా యాక్షన్ చిత్రాలే ఎక్కువగా చేసిన ఆయన, ఈ సినిమాతో మళ్లీ కామెడీ వైపు మళ్లనున్నారు.
హారర్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ కథను వినగానే ప్రభాస్ వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. మారుతి మొదట్లో కొంత వెనుకంజ వేసినప్పటికీ, ప్రభాస్ ప్రోత్సాహంతో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఇదే విషయాన్ని దర్శకుడు మారుతి స్వయంగా వెల్లడించారు.
సినిమాలో ముగ్గురు కథానాయికలు నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. మొదట ఒక్క హీరోయిన్ను మాత్రమే ప్లాన్ చేసినప్పటికీ, ప్రభాస్ సూచన మేరకు ముగ్గురు హీరోయిన్లుగా చిత్రీకరించనున్నారు. తాజా షెడ్యూల్ ముగిసిన తర్వాత పాటల చిత్రీకరణ ప్రారంభమవుతుందని సమాచారం.
Recent Random Post:















