
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలను చేస్తున్న ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ ను కూడా త్వరలోనే ఉగాది సందర్భంగా ప్రారంభించనున్నాడు. వీటితో పాటు సలార్ 2 (ప్రశాంత్ నీల్) మరియు కల్కి 2 (నాగ్ అశ్విన్) చిత్రాలను కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభాస్ పై ఉంది.
ఇప్పటికే హోంబళే ఫిల్మ్స్ ప్రభాస్‌తో మూడు సినిమాలకు డీల్ కుదుర్చుకుందని టాక్. తాజాగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో డార్లింగ్ మరో భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రానుండగా, ప్రభాస్ ఇప్పటికే ఈ సినిమాకు లుక్ టెస్ట్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ వారం లుక్ టెస్ట్ పూర్తి కావొచ్చని, ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రభాస్ కోసం ఓ పవర్ఫుల్ లుక్ డిజైన్ చేశాడని టాక్.
ఇక ప్రశాంత్ వర్మ విషయానికి వస్తే, హనుమాన్ ఘన విజయాన్ని సాధించిన తర్వాత ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏదీ అనేది క్లారిటీ రాలేదు. రణ్వీర్ సింగ్‌తో ప్రాజెక్ట్ ఉంటుందని ఊహాగానాలు వినిపించినా అది క్యాన్సిల్ అయింది. అలాగే, జై హనుమాన్ చేయనున్నట్లు వార్తలు వచ్చినా, రిషబ్ శెట్టి కాంతార 2తో బిజీగా ఉండటంతో అది కూడా నిలిచిపోయింది. మరోవైపు, నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కూడా ప్రశాంత్ వర్మ చేతికే వచ్చిందన్న టాక్ ఉంది. అయితే డిసెంబర్లో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.
ఇప్పుడిదంతా పక్కనపెడితే ప్రభాస్-ప్రశాంత్ వర్మ కాంబో ఖాయమైందని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రానుందని కోలీవుడ్, టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ముందుగా ఏ సినిమాను పట్టాలెక్కిస్తాడో చూడాలి!
Recent Random Post:















