
‘కేజీఎఫ్ చాప్టర్ 2’తో 1200 కోట్ల రూపాయల కలెక్షన్ రికార్డులు సృష్టించి పాన్ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్… ఒక్కసారిగా నేషన్వైడ్ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అతడి హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి “ఇదే నెక్స్ట్ బిగ్ హీరో” అని ఇండస్ట్రీ మొత్తం ఫిక్స్ అయిపోయింది. ట్రేడ్ పండితులూ కూడా — సరైన కథలు దొరికితే ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ మార్కెట్‌ను రీపీట్ చేయగల హీరో యష్నే అని నమ్మారు. కానీ ఆ అంచనాలు వాస్తవం కాలేదు.
ఇక ప్రభాస్ వైపు చూస్తే — ‘బాహుబలి’ తర్వాత ‘సాహో’, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’ వంటివి భారీ అంచనాలతో వచ్చి నిరాశపరిచినా, ఆయన ఎక్కడా ఆగలేదు. ఒక ఫ్లాప్ తగిలిందంటే నెలల తరబడి గ్యాప్ తీసుకోకుండా, కొత్త జానర్లు, కొత్త దర్శకులతో ట్రై చేస్తూనే ఉన్నాడు. ‘సలార్’తో యాక్షన్ మోడ్‌లోకి వచ్చాడు, ‘కల్కి’తో సై-ఫైలోకి అడుగుపెట్టాడు, ఇప్పుడు ‘రాజా సాబ్’తో హారర్ కామెడీ చేస్తున్నాడు, ‘స్పిరిట్’తో సందీప్ వంగా వంటి డైరెక్టర్‌తో కలసి పని చేస్తున్నాడు. హిట్, ఫ్లాప్ పక్కన పెడితే — “ప్రభాస్ నెక్స్ట్ ఏం చేస్తున్నాడు?” అనే క్యూరియాసిటీని మాత్రం ఆయన ఎప్పుడూ బ్రేక్ చేయలేదు.
అయితే యష్ విషయంలో సీన్ రివర్స్ అయింది. ‘కేజీఎఫ్ 2’ తర్వాత చాలా పెద్ద గ్యాప్ తీసుకున్నాడు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘టాక్సిక్’ను ప్రకటించడానికి కూడా చాలా టైమ్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తిగా సైలెంట్‌గా, సీక్రెట్‌గా జరుగుతోంది. బడ్జెట్ 600 కోట్ల దాకా పెరిగిందని, డైరెక్టర్‌తో డిఫరెన్సులు ఉన్నాయని, రీషూట్లు జరుగుతున్నాయని రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ టీమ్ నుంచి ఎటువంటి స్పష్టత లేదు.
ఈ లాంగ్ గ్యాప్, ఈ సీక్రెసీ యష్ కెరీర్‌కు ప్లస్ అవుతుందా, లేక మైనస్ అవుతుందా అన్నది పెద్ద ప్రశ్న. ప్రభాస్‌లా ‘కేజీఎఫ్ 2’ తర్వాత యష్ వెంటనే రెండు మూడు డిఫరెంట్ సినిమాలను లైన్లో పెట్టి ఉంటే, ఇప్పటికీ ఒక సినిమా రిలీజ్ అయ్యి ఉండేది. అది యావరేజ్ అయినా, ఫ్లాప్ అయినా… యష్ మార్కెట్లో యాక్టివ్‌గా ఉండేవాడు. ఇప్పుడు ‘టాక్సిక్’పైనే అంత అంచనా, అంత ప్రెషర్.
ఈ సినిమా ఏదైనా తేడా కొడితే, ‘కేజీఎఫ్ 2’ తెచ్చిన పాన్ఇండియా ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు చాలామందికి అనిపిస్తోంది — ప్రభాస్‌లా కీప్ మూవింగ్ స్ట్రాటజీ ఫాలో అయి ఉంటే బెటర్ అని.
Recent Random Post:















