
ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ ఐకాన్‌గా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా, యూనిసెఫ్ బ్రాండ్ అంబాసడర్‌గా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఆంగ్ల వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న పీసీ ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #SSMB29లో నటిస్తోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్నాడు. సినిమా చిత్రీకరణ వేగంగా సాగుతోంది.
రాజమౌళి సినిమాకోసం నెలల తరబడి కఠినంగా శ్రమిస్తున్న ప్రియాంక చోప్రా, ఇప్పుడు ఓ పాట కోసం గాయని అవతారం ఎత్తింది. దాదాపు 10 నెలల క్రితం విడుదలై ఇంటర్నెట్ను ఊపేసిన వామ్ బృందం పాడిన “లాస్ట్ క్రిస్మస్” పాటకు పీసీ తన గాత్రాన్ని అందించింది. ఈ పాటకు దేశీ వెర్షన్‌గా ప్రియాంక చోప్రా ఆలపించింది. అయితే, ఈ పాటతో పాటు సోషల్ మీడియాలో పీసీకి తీవ్రమైన ట్రోలింగ్ ఎదురైంది. కొందరు ఈ పాటను “చంపేసిందంటూ”, మరికొందరు “అతిగా ఆటో-ట్యూన్ వాడడంతో ఆమె స్వరం సహజంగా లేదు” అంటూ విమర్శించారు.
ఈ విమర్శలను ప్రియాంక చోప్రా తేలికగా తీసుకోకుండా, తనదైన శైలిలో స్పందించింది. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో “చాలా మంది నన్ను వారిలాగా ఉండటానికి ప్రేరేపించారు!” అనే క్రిప్టిక్ పోస్ట్‌ను షేర్ చేసింది. ఇది ట్రోలర్లకు సమాధానమని అభిమానులు భావిస్తున్నారు.
“క్రిస్మస్ కర్మ” అనే ఈ పాటను తన స్నేహితురాలు గురిందర్ చద్ధా కోసం పాడానని పీసీ వెల్లడించింది. “నా స్థాయిలో ఆమెకు మద్దతుగా ఈ పాట పాడాను. మనలో చాలామందికి క్రిస్మస్ సౌండ్‌ట్రాక్‌గా ఉన్న ఈ పాటకు దేశీ ట్విస్ట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని ఆశిస్తున్నాను,” అని చెప్పింది.
కెరీర్ విషయానికొస్తే, ప్రియాంక చోప్రా ఇటీవల నటించిన యాక్షన్ చిత్రం “హెడ్స్ ఆఫ్ స్టేట్” ఈ ఏడాది విడుదలైంది. జాన్ సినా, ఇద్రిస్ ఎల్బా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, పీసీ యాక్షన్ సీన్స్‌కు మంచి ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం ఆమె రాజమౌళి చిత్రంపైనే పూర్తిగా దృష్టి సారించింది.
Recent Random Post:














