
టాలీవుడ్లో తన ప్రత్యేకమైన స్టైల్‌తో పేరు తెచ్చుకున్న నటుడు ఫిష్ వెంకట్ ఇటీవల కిడ్నీ సంబంధిత వ్యాధితో కన్నుమూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీతో పాటు కుటుంబంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.
శనివారం ఫిష్ వెంకట్ అంత్యక్రియలు హైదరాబాద్ మారేడ్‌పల్లి హిందూ శ్మశానవాటికలో జరిగినాయి. ముందుగా ఆయన భౌతికకాయాన్ని సికింద్రాబాద్‌లోని అడ్డగుట్టలో ఉన్న నివాసంలో ఉంచి, అభిమానులకు వీక్షణార్థం ఏర్పాటు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంతిమయాత్ర నిర్వహించారు.
ఇదిలా ఉండగా, ఫిష్ వెంకట్‌కు గబ్బర్ సింగ్ టీమ్ కన్నీటి వీడ్కోలు పలికింది. పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ గబ్బర్ సింగ్ సినిమాలోని పోలీస్ స్టేషన్ సీన్లో ఫిష్ వెంకట్ ఇచ్చిన హాస్యానికి ఇప్పటికీ గుర్తింపు ఉంది. ఆ సీన్లో వెంకట్‌తో పాటు నటించిన గబ్బర్ సింగ్ టీమ్ అంతా ఆయన అంత్యక్రియలకు హాజరై మీడియాతో మాట్లాడింది.
“ప్రభాస్ గారు రూ.50 లక్షలు సాయం చేయనున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ డబ్బులు మా వదినమ్మకు (వెంకట్ భార్యకు) ఇవ్వాలని కోరుతున్నాం. ఆమెకు ప్రస్తుతం ఎలాంటి ఆదాయం లేదు. ఇప్పటి వరకు వచ్చిన డబ్బులన్నీ ఆస్పత్రి ఖర్చులకే వెచ్చించాము. ఫిష్ వెంకట్ అన్నతో కలిసి పనిచేసిన హీరోలందరూ ఇప్పుడు కనీసం కుటుంబాన్ని ఆదుకోవాలి” అని గబ్బర్ సింగ్ టీమ్ వేడుకుంది.
అంతేకాదు, “ప్రభాస్ గారు ఇచ్చారు అనే వార్తలు వచ్చినా, నిజంగా ఆ సాయం అందలేదు. ప్రభాస్ టీమ్‌ను సంప్రదించాం కానీ ఇంకా స్పందన లేదు. ప్రభాస్ గారికి విషయం తెలియకపోవచ్చు. అందుకే ఇప్పటికైనా ఆ సాయం వదినకు అందించాలని కోరుకుంటున్నాం” అని వారు చెప్పారు.
మొత్తానికి ఫిష్ వెంకట్ కుటుంబాన్ని ఆదుకోవాలన్న గబ్బర్ సింగ్ టీమ్ విజ్ఞప్తి ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది.
Recent Random Post:















