ఫ్యామిలీతో క్రిస్మస్ సెలబ్రేషన్స్‌.. రాజమౌళి సినిమాకు రెడీ అవుతున్న మహేష్ బాబు

Share


సినిమాల షూటింగ్స్‌ నుంచి కాస్త సమయం దొరికితే చాలు… ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లి ఎంజాయ్ చేసే కొద్దిమంది హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుంటారు. ఏ సినిమా చేస్తున్నా సరే, తన కుటుంబానికి సమయం కేటాయించడంలో మహేష్ ఎప్పుడూ వెనకాడరు.

అదే క్రమంలో ఈసారి క్రిస్మస్ పండుగను ఆయన తన ఫ్యామిలీతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతోనే కాదు, తన చుట్టుపక్కల వారితో కూడా ఈ పండుగ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు మహేష్ బాబు.

క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయగా, అందులో మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్, కూతురు సితార ఘట్టమనేని, కొడుకు గౌతమ్ ఘట్టమనేనితో పాటు పలువురు బంధుమిత్రులు కనిపించారు. మొత్తం మీద ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు మహేష్. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ కావడంతో, మహేష్ లుక్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు కెరీర్ విషయానికి వస్తే… ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో తొలిసారిగా ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. ఇది కేవలం పాన్ ఇండియా కాదు… ఏకంగా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ నటుడు కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ సినిమా 2027 సమ్మర్ కానుకగా విడుదల కానుండటంతో, అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి ‘గ్లోబ్ ట్రాటర్’ పేరుతో రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే మహేష్ బాబు లుక్‌తో పాటు, ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్ర ఫస్ట్ లుక్, అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి. దీనితో పాటు ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందనుందని సమాచారం. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏకంగా రూ.1200 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

మొత్తానికి, మరో రెండు సంవత్సరాల వరకు మహేష్ బాబు కొత్త సినిమాలు విడుదలయ్యే అవకాశం లేకపోవడంతో, ఆయన కెరీర్‌లో విజయవంతమైన సినిమాలను రీ-రిలీజ్ చేస్తూ అభిమానులు సరిపెట్టుకుంటున్నారు.


Recent Random Post: