
భారతదేశంలో సంచలన విజయం సాధించిన వెబ్ సిరీస్‌లలో ది ఫ్యామిలీ మ్యాన్ ఒకటి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ రెండు సీజన్లు ఇప్పటికే భారీ హిట్ కావడం తెలిసిందే. విపరీతమైన స్పందన రావడంతో మేకర్స్ రాజ్ & డీకే మూడో సీజన్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
ప్రత్యేకంగా సీజన్ 2లో సమంత కీలక పాత్రలో నటించడం ఈ సిరీస్‌కు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. సీజన్ 2 చూసినవారిలో చాలామంది తిరిగి మొదటి సీజన్‌ను కూడా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 పై భారీ ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రైమ్ వీడియో “ఫ్యామిలీ మ్యాన్ 3 కమ్మింగ్ సూన్” అంటూ విడుదల చేసిన పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది.
తాజాగా ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలో నటించిన మనోజ్ బాజ్‌పాయ్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే సీజన్ 3 షూటింగ్ పూర్తయిందని, అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ మొదలవుతుందని ఆయన తెలిపారు. ఫ్యామిలీ మ్యాన్ మొదలుపెట్టినప్పుడు ఇంతటి సక్సెస్ వస్తుందని తాను ఊహించలేదని, తన కెరీర్లో గరిష్టమైన ఆదరణ పొందిన ప్రాజెక్టులలో ఇదొకటి అని చెప్పారు.
ఇక సూపర్ హిట్ సిరీస్ కిల్లర్ సూప్ చేసినప్పటికీ ఫ్యామిలీ మ్యాన్ ద్వారా వచ్చిన అనుభవం వేరే లెవెల్ అని మనోజ్ చెప్పారు. సీజన్ 3 అందరి అంచనాలను దాటి వెళ్లేలా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “సీజన్ 2లో సమంత హైలైట్ అయితే, సీజన్ 3లో జైదీప్ అహ్లావత్ మెప్పిస్తారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది” అని మనోజ్ బాజ్‌పాయ్ వివరించారు.
Recent Random Post:















