బన్నీ విలన్ అవతార్? అట్లీ సినిమాలో అల్లు అర్జున్ డబుల్ రోల్

Share


పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, పుష్ప 2 తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా అధికారికంగా అనౌన్సవ్వగా, ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అవ్వగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది.

ఈ సినిమా చుట్టూ భారీ బజ్ క్రియేట్ అవుతోంది. అట్లీ ‘నెవ్వర్ బిఫోర్’ కాన్సెప్ట్‌తో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్. మరింత ఆసక్తికర విషయం ఏమిటంటే – ఈ సినిమాలో అల్లు అర్జున్ డబుల్ రోల్‌లో కనిపించబోతున్నారని, ముఖ్యంగా హీరోతో పాటు విలన్ పాత్రను కూడా పోషించనున్నారని చెబుతున్నారు.

ఇప్పటికే ఇలా డ్యూయల్ రోల్స్ చేసిన స్టార్ హీరోల జాబితాలో బాలకృష్ణ, సూర్య, కమల్ హాసన్, రజినీకాంత్, కృష్ణ, షారుక్ ఖాన్ లాంటి పేర్లు ఉన్నాయి. అయితే అందరిలోనూ విజయవంతమైనవారు కొంతమంది మాత్రమే. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఆ లిస్ట్‌లో చేరబోతున్నాడన్న మాట.

విలన్ క్యారెక్టర్ విషయంలో బన్నీ ఈ సారి భిన్నమైన లుక్‌తో, ఇంతవరకు చూసిన దాని కన్నా భయంకరమైన గెటప్‌లో కనిపించబోతున్నాడని టాక్. అట్లీ డిజైన్ చేస్తున్న ఈ పాత్ర సైన్స్ ఫిక్షన్ థీమ్ ఆధారంగా ఉండే అవకాశం ఉంది. సినిమా మొత్తం పాన్ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో తెరకెక్కనుండగా, రూ.500 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం – ఇందులో ఐదుగురు హీరోయిన్‌లు నటించనున్నారట. మొదట సమంత పేరు వినిపించినా, తాజా సమాచారం మేరకు ఆమె ఈ ప్రాజెక్టులో భాగం కాదని క్లారిటీ వచ్చింది. అంతేకాదు, ఈ మూవీలో విదేశీ నటులూ ఉండనున్నారని తెలుస్తోంది.

మొత్తంగా బన్నీ – అట్లీ కాంబినేషన్ 2026లో భారీ స్థాయిలో థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా షురూ ఎప్పుడు అవుతుందో చూద్దాం!


Recent Random Post: