![]()
‘పుష్ప’ ఘన విజయంతో బాలీవుడ్లో అల్లు అర్జున్ ఓ బ్రాండ్ గా మారిపోయాడు. ఒక్క హిందీ మార్కెట్ నుంచే వందల కోట్ల వసూళ్లను కొల్లగొట్టడం, బన్నీ మాస్ అప్పీల్ తో బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించడం చూసిన నిర్మాతలు, దర్శకులు ఆయనతో సినిమా చేయాలని క్యూ కడుతున్నారు.
అందరూ బన్నీని బాలీవుడ్‌కు కొత్తగా పరిచయమైన స్టార్‌గా చూస్తున్నా, అక్కడ ఆయన పాగా వేయడం ఇప్పుడప్పుడే మొదలైన విషయం కాదు. అసలు బాలీవుడ్ ఇమేజ్‌కు బీజం ఇప్పటికే పడిపోయింది.
అల్లు అర్జున్ నటించిన తొలి చిత్రం ‘గంగోత్రి’ హిందీలో డబ్బింగ్ అయ్యి విడుదలైంది. ఆ తర్వాత ఆయన నటించిన క్లాసిక్ లవ్ స్టోరీలు కూడా హిందీ అనువాదంలో విడుదలయ్యాయి, దీంతో బన్నీకి అక్కడ మంచి గుర్తింపు వచ్చింది. అయితే అసలైన మార్పు ‘సరైనోడు’తో వచ్చింది.
‘సరైనోడు’ హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో 300 మిలియన్ వ్యూస్‌ను దాటి రికార్డు సృష్టించింది.
ఇది 300 మిలియన్ వ్యూస్‌ను సాధించిన తొలి భారతీయ సినిమా కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రం ఆ రికార్డును అధిగమించలేకపోయింది.
ఇలా బన్నీ బాలీవుడ్ మార్కెట్‌ను నెమ్మదిగా కానీ గట్టిగా చాపకింద నీరులా పెంచుకుంటూ వచ్చాడు. ఇక ‘పుష్ప’తో అతనికున్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ‘పుష్ప 2’ విడుదలకు ముందే బాలీవుడ్ స్టార్ హీరోల సరసన అల్లు అర్జున్ పేరు టాప్ లిస్ట్‌లో ఉండడం, హిందీ నిర్మాతలు ఆయన కోసం భారీ ప్రాజెక్ట్స్ సిద్ధం చేయడం, అతడి పాన్ ఇండియా స్టార్ డమ్‌ను మరింత పటిష్టం చేస్తోంది.
ఈ దశలో బన్నీ హిందీ మార్కెట్లో నెంబర్ వన్ టాలీవుడ్ స్టార్ అనే మాట అందరూ నిస్సందేహంగా అంగీకరిస్తున్నారు!
Recent Random Post:















