
టాలీవుడ్ యువహీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల రాంగ్ రూట్‌లో కారును నడిపిన ఘటనతో వివాదంలో చిక్కుకున్నారు. ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించడమే కాకుండా, తనను ఆపిన కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించినట్లు కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై నిన్నటినుండి సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది.
ఈ వ్యవహారంపై నెటిజన్లు మిశ్రమ స్పందన ఇస్తున్నారు. “హీరో అయినందునే అతన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి రూల్ బ్రేకింగ్ రోజూ జరుగుతూనే ఉంటుంది,” అంటూ కొందరు బెల్లంకొండకు మద్దతు తెలిపారు. మరోవైపు, “ప్రముఖులు మరింత బాధ్యతగా ఉండాలి” అంటూ ఆయనపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
ఈ వివాదం పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించి బెల్లంకొండపై కేసు నమోదు చేశారు. అయితే ఇది తీవ్రమైన నేరం కాదు, కానీ హీరోపై కేసు అన్నవిషయం సోషల్ మీడియాలో ఎక్కువగా హైలైట్ అయింది. బెల్లంకొండ మాత్రం “తాను ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించలేదని” వివరణ ఇచ్చినట్లు సమాచారం.
ఇకపోతే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘భైరవం’ సినిమా మే 30న విడుదల కానుంది. ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనుండటంతో అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానంతరం ‘టైసన్ నాయుడు’, ‘హైందవ’, ‘కిష్కిందపూరి’ వంటి పలు ప్రాజెక్టులలో బెల్లంకొండ నటిస్తున్నారు. గతంలో హిందీలో చేసిన ‘చత్రపతి’ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో, ‘భైరవం’తో తిరిగి ఫామ్ లోకి వస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
Recent Random Post:















