బోల్డ్ సీన్స్ పై తమన్నా బోల్డ్ ఆన్సర్..!

మిల్కీ బ్యూటీ తమన్నా వరస అవకాశాల తో అదరగొడుతోంది. మొన్నటి వరకు సినిమాల తో అదర గొట్టిన ఆమె ఇప్పుడు వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా జీ కర్దా అనే వెబ్ సిరీస్ తో తమన్నా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమన్నా కోసం ఆ వెబ్ సిరీస్ చూసినవారు చాలా మంది షాకయ్యారు. ఎందుకంటే ఆమెను ఇప్పటి వరకు అంత బోల్డ్ గా చూసిందిలేదు. కేవలం డైలాగులు మాత్రమేకాదు రొమాంటిక్ బెడ్రూమ్ సీన్లలోనూ నటించింది. మెను అంత బోల్డ్ గా చూసి ఫ్యాన్స్ షాకౌతున్నారు. కానీ తమన్నా ఈ వెబ్ సిరీస్ లో చాలా అందంగా కనిపించడం విశేషం.

అయితే అలాంటి సీన్లలో నటించడం అవసరమా అనే ప్రశ్న ఆమెకు ఇటీవల ఎదురవ్వగా చాలా బోల్డ్ గా సమాధానం ఇవ్వడం గమనార్హం. తాను పాత్ర కు తగినట్లుగా నటించానని తమన్నా చెప్పారు. ఆ పాత్ర డిమాండ్ చేసింది కాబట్టి తాను అలాంటి పాత్ర చేయాల్సి వచ్చిందన్నారు. ఒకవేళ అలాంటి సీన్స్ నచ్చకపోయినా కథ లో భాగంగా చూడాలి అంటూ ఆమె బోల్డ్ గా సమాధానం ఇచ్చి అందరికీ షాకిచ్చింది.

ఈ జీ కర్దా వెబ్ సిరీస్ కి అరుణిమా శర్మ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా త్వరలో తమన్నా నుంచి మరో వెబ్ సిరీస్ రానుంది. అదే లస్ట్ స్టోరీస్ 2. దీనిలో తమ్మూ బేబీ మరింత హాట్ కా కనిపించనుందని అంత కు మించిన బోల్డ్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.

ఈ వెబ్ సిరీస్ లో ఆమె తన బాయ్ ఫ్రెండ్ తోనే రొమాంటిక్ సీన్స్ చేసింది. నిజానికి అందు లో నటించిన తర్వాతే నటుడు విజయ్ వర్మతో ఆమె ప్రేమ లో పడటం విశేషం. వీరిద్దరూ ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నారు. త్వరలోనే వీరు వారి బంధాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్లనున్నారని తెలుస్తోంది.

కాగా ఈ వెబ్ సిరీస్ లో విజయ్ తో కలిసి నటించినప్పుడు తనకు తాను చాలా సేఫ్ గా ఫీలయ్యానని ఆ కారణం తోనే అతని తో ప్రేమ లో పడిపోయానని ఆమె చెప్పారు. ఇప్పటి వరకు చాలా మంది నటుల తో నటించినా అలాంటి ఫీలింగ్ ఎవరితో నూ కలగలేదని ఆ నమ్మకం విజయ్ ఇచ్చాడని ఆమె చెప్పారు.


Recent Random Post: