మంచు మనోజ్ కొత్త ప్లాన్.. నమస్తే వరల్డ్

టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. ఇటీవలే శుభవార్త చెప్పారు. తన భార్య మౌనిక గర్భం దాల్చిందని, త్వరలో తాను తండ్రిని కాబోతున్నట్లు తెలిపారు. తాజాగా క్రిస్మస్ సందర్భంగా మరో గుడ్ న్యూస్ చెప్పింది ఈ జంట. చిన్నారుల కోసం నమస్తే వరల్డ్ పేరుతో బొమ్మల వ్యాపారాన్ని స్టార్ట్ చేసినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని మనోజ్, మౌనిక ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. హైదరాబాద్ లోని ఫేమస్ ప్రసాద్ ఐమాక్స్ లో నమస్తే వరల్డ్ పేరుతో తొలి ఔట్ లెట్ ను ప్రారంభించారు.

ఈ సందర్బంగా నమస్తే వరల్డ్ సీఈవో భూమా మౌనిక మంచు మాట్లాడారు. పిల్లల కోసం వచ్చిన నమస్తే వరల్డ్ ఐడియాకు మనోజ్ వెంటనే ఓకే చెప్పారని వెల్లడించారు. ఆయన సహకారంతో ముందుకు సాగినట్లు చెప్పారు. నమస్తే వరల్డ్ ద్వారా మన వాళ్ల టాలెంట్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని క్లారిటీ ఇచ్చారు. నమస్తే వరల్డ్ స్టార్టప్ కు మద్దతు ఇస్తున్న రిలయన్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నమస్తే వరల్డ్ సీఐఓ, హీరో మంచు మనోజ్ కూడా మాట్లాడారు. ఇప్పటి వరకు విదేశీ సంస్కృతికి మనమంతా అలవాటు పడ్డామని తెలిపారు. ఇప్పుడు భారతీయ సంస్కృతిని పెంపొందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. మన దేశానికి గొప్ప సంస్కృతి ఉందని గుర్తుచేశారు. మన సంస్కృతీ సంప్రదాయాలు, కళలను బయటకు తీసుకురావడానికి నమస్తే వరల్డ్ మంచి వేదిక అని వివరించారు.

సినిమాల్లో తమను ఆదరించినట్లు ఈ కొత్త వ్యాపారంలో కూడా సపోర్ట్ చేయాలని మనోజ్ కోరారు. కుమారుడు థైరవ్ వల్ల తమ వెంచర్ కు మరింత ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. దేశంలోని అన్ని జియో ఔట్‌లెట్లలో నమస్తే బ్రాండ్ బొమ్మలు ఉన్నట్లు తెలిపారు. ముంబయిలోని జియో గార్డెన్స్‌లోని హామ్లీస్ వండర్‌ల్యాండ్‌లో నమస్తే వరల్డ్ బొమ్మలను ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

క్రిస్మస్ సందర్భంగా తన అభిమానులకు ఓ అద్భుతమైన అవకాశం ఇచ్చారు మనోజ్. ‘మీ పిల్లలు వేసే బొమ్మలను నమస్తే.వరల్డ్‌ లో అప్లోడ్ చేస్తే ఆ పెయింటింగ్‌ బొమ్మగా చేసి మీకు పంపిస్తాం. అలాగే బెస్ట్‌ బొమ్మలు సెలక్ట్‌ చేసి దాని మీద కార్టూన్స్‌, సూపర్‌ హీరో సినిమాలు చేస్తామని మాటిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు మనోజ్‌.

మోహన్‌బాబు వారసుడిగా వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టిన మనోజ్‌ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతకాలంగా మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నారు. 2015లో ప్రణతి అనే యువతిని పెళ్లి చేసుకోగా 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశారు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈమెకు కూడా ఇది రెండో పెళ్లే. మనోజ్‌ను పెళ్లి చేసుకునే సమయానికే మౌనికకు ధైరవ్‌ అనే బాబు ఉన్నాడు.


Recent Random Post: