మణిరత్నం క్షమాపణ: థగ్ లైఫ్ వివరణ

Share


తన సినిమాలతో ఎప్పుడూ ప్రత్యేకమైన ముద్ర వేసే దర్శకుడు మణిరత్నం ఇటీవల ప్రేక్షకుల ముందు క్షమాపణలు చెప్పడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘థగ్ లైఫ్’ చిత్రం ఆశించిన స్థాయికి చేరుకోకపోవడంతో, దర్శకుడు స్వయంగా క్షమాపణలు కోరడం విశేషం. ఇంతకు ముందు అనేక విజయాలు, పరాజయాలు ఎదుర్కొన్నా ఎప్పుడూ క్షమాపణలు చెప్పని మణిరత్నం, ఈసారి మాత్రం తన అభిమానుల అంచనాలను అందుకోలేకపోయామనే బాధను వ్యక్తం చేశారు.

కమల్ హాసన్ – మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 37 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. 1987లో వచ్చిన ‘నాయకుడు’ లాంటి సక్సెస్‌ను రిపీట్ చేస్తారనుకున్నారు. కానీ, అది సాధ్యం కాలేదు. అందుకే ఇంత భారీ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకుల పట్ల తన బాధ్యతను గుర్తించిన మణిరత్నం, క్షమాపణలు తెలపడం జరిగింది.

ఇది సినిమా అభిమానులకు షాక్ ఇచ్చినప్పటికీ, దర్శకుడి వినయానికి మణిరత్నం అభిమానులు ఫిదా అయ్యారు. ఇకపై మరింత బలమైన కథలతో ప్రేక్షకుల అంచనాలను అందుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.


Recent Random Post: