
ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్న పేరు ఎవరు అంటే తొందరగా చెప్పే పేరు సుమ కనకాల. ఆమె తర్వాత అనసూయ, రష్మి లాంటి వారూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ రేసు మొదలయ్యే ముందు నుంచే బుల్లితెరపై తనదైన ముద్ర వేసుకున్న ఉదయభాను ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
‘హృదయాంజలి’ అనే షోతో ప్రారంభించిన ఉదయభాను, తన చురుకుదనం, మాటల తేటతనంతో పాటు అందచందాలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆ షోతోనే మంచి క్రేజ్ అందుకున్న ఆమె, తర్వాత ఎన్నో కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరించారు. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఆమెకి అవకాశాలు తగ్గిపోయాయి.
బహు కాలం తరువాత తాజాగా ఆమె ఒక సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి హోస్ట్‌గా వ్యవహరించారు. ‘ఓ భామ అయ్యో రామ’ అనే చిత్ర ఈవెంట్‌కి యాంకరింగ్ చేసిన ఉదయభాను వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన డైరెక్టర్ విజయ్ కనకమేడల మాట్లాడుతూ – “చాలా రోజుల తర్వాత ఉదయభాను గారు మళ్లీ యాంకరింగ్ చేస్తున్నారు” అని చెప్పారు. దానికి ఉదయభాను స్పందిస్తూ –
“ఇదొకటే చేశాను, మళ్లీ చేస్తానో లేదో కూడా నాకు గ్యారెంటీ లేదు. రేపు ఈవెంట్ అనుకుంటాం కానీ, అదే రోజు ఈవెంట్ ఉండదనిపిస్తుంది. ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద సిండికేట్ పెరిగింది. సుహాస్ మా బంగారం, కాబట్టి ఈ ఈవెంట్ చేసాను. మనసులో మాటే చెప్పుతున్నాను” అన్నారు.
తర్వాత నటుడు మచ్చ రవి మాట్లాడుతూ –
“ఉదయభాను మైక్ పట్టుకుంటే ఒక నారి వంద తుపాకుల టైప్” అంటూ ప్రశంసించగా, ఆమె నవ్వుతూ
“నాకు చాలా బుల్లెట్లు తగిలాయి, కానీ అది ఎవరికీ తెలియదు” అని స్పందించారు.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యాంకర్‌గా ఒక వెలుగు వెలిగిన ఉదయభాను, మళ్లీ తెరపై కనిపించడం అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.
Recent Random Post:















