ముంబై వీధుల్లో రాత్రిపూట అలా చేస్తే ఎలా అమ్మడు!

శత్రుజ్ఞసిన్హా వారసురాలిగా బాలీవుడ్లో లాంచ్ అయిన సోనాక్షి సిన్హా కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ సత్తా చాటుతోంది. వెబ్ సిరీస్ ల ద్వారా మరింత పాపులర్ అవుతుంది. కంటెంట్ ఓరియేంటెడ్ సిరీస్ ల్లో నటిస్తూ మంచి పేరు దక్కించుకుంటుంది. ఆ మధ్య రిలీజ్ అయిన దహడ్ లో సిన్సియర్ పోలీస్ అధికారిణి పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే.

అయితే ఈసినిమా కారణంగా సోనాక్షి తల్లిదండ్రుల్ని బాగా ఇబ్బంది పెట్టిన సంఘటనని గుర్తు చేసుకుంది. యాక్షన్ చిత్రాలంటే చాలా ఇష్టం. వాటి ద్వారా చాలా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. దహాడ్ ద్వారా బైక్ నడిపే అవకాశం వచ్చింది.

అంతకు ముందే ఓబైక్ కొన్నా. అది చూసి మా అమ్మనాన్నలు బాగా కంగారు పడ్డారు. నడిపేటప్పుడు కిందపడి దెబ్బలు తగిలించుకుంటానని బాధపడేవారు. కానీ వాళ్లకి తెలియని విషయం ఏంటంటే? అదే బైక్ నేను రాత్రుళ్లు షికార్లు చేసి వచ్చేదాన్ని.

ముంబై వీధుల్లో మాస్క్ ధరించి అలవోకగా తిరిగేదాన్ని. దర్శకురాలు రినూ కగ్టి అయితే స్టంట్ మాస్టర్ కన్నా నేను బాగా బైక్ నడుపుతున్నాను అనేవారు. నాలో ఆ నమ్మకమే నాకు నేనుగా సొంతంగా బైక్ నడిపే సన్నివేశాలకు అవకాశం కల్పించింది.

లేదంటే వాటికోసం ప్రత్యేకంగా డూప్ పెట్టాల్సి వచ్చేది. నిర్మాతలకు అదనపు భారంగా ఉండేది. తర్వాత నా గురించి ఈ విషయాలన్నీ అమ్మనాన్నలకు తెలిసి షాక్ అయ్యారు. ఇదంతా నువ్వే చేసావా? అని ఆశ్చర్యానికి గురయ్యారు.

పిల్లలంటే తల్లిదండ్రులకు ఎంతప్రేమ మరోసారి నాకు అర్ధమైంది’ అని తెలిపింది. ఇక అమ్మడి కెరీర్ సంంగతి చూస్తే సౌత్ లో నటించాలని ఆసక్తి చూపిస్తుంది. అయితే ఇక్కడ టేస్ట్ కి తగ్గట్టు అమ్మడు సెట్ అవ్వడం లేదు. లింగ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు.


Recent Random Post: