
పాన్-ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Mrunal Thakur మరోసారి విభిన్నమైన, ఛాలెంజింగ్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్ల మేళవింపుగా రూపొందుతున్న డెకాయిట్ సినిమాలో ఆమె పోషించిన సరస్వతి పాత్ర తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రిస్కీ యాక్షన్ స్టంట్స్ ఈ సినిమాకు హైలైట్‌గా మారతాయని ఆమె పేర్కొన్నారు.
బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో మంచి ఫామ్‌లో ఉన్న Adivi Sesh హీరోగా నటిస్తున్న ఈ పాన్-ఇండియా యాక్షన్–రొమాంటిక్ థ్రిల్లర్‌కు షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మాణం చేపట్టారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పగా, ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన మృణాల్, సరస్వతి పాత్ర చాలా కాంప్లెక్స్‌గా ఉన్నప్పటికీ దర్శకుడు బృందం దాన్ని సులభంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దిందని చెప్పారు. ఛాలెంజింగ్ పాత్రలు చేయడం తనకు ఎప్పుడూ ఇష్టమని, ఈ క్యారెక్టర్ తనకు మంచి సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. అలాగే ఛేజింగ్ సీన్స్, డ్రైవింగ్ సీన్స్‌తో పాటు హ్యాండ్ బ్రేక్ లేకుండా అంబులెన్స్ డ్రైవ్ చేసిన సీక్వెన్స్ తనకు థ్రిల్లింగ్ అనుభవమని వెల్లడించారు.
తెలుగు ప్రేక్షకులతో తన అనుబంధాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాల ద్వారా తనను తెలుగు అమ్మాయిగా అంగీకరించారని, ప్రేక్షకుల ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. సరస్వతి పాత్ర కూడా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హీరో శేష్ గురించి మాట్లాడుతూ, ఆయన సినిమా పట్ల చూపే ప్యాషన్ అద్భుతమని, డెకాయిట్ ఆయన కెరీర్లో బెస్ట్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలుస్తుందని ప్రశంసించారు. అలాగే ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్‌తో కలిసి పని చేయడం గొప్ప అనుభవమని తెలిపారు. అనురాగ్‌తో కలిసి తెలుగు డైలాగ్స్ నేర్చుకోవడం కొత్త అనుభవంగా నిలిచిందని చెప్పారు.
డైరెక్టర్ షానియల్ డియో విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని, టీమ్ వర్క్ అద్భుతంగా ఉందని మృణాల్ అన్నారు. నిర్మాత సుప్రియ షూటింగ్ సమయంలో తన ఆరోగ్యం పట్ల చూపిన శ్రద్ధను కూడా గుర్తు చేసుకున్నారు.
మొత్తంగా యాక్షన్, ఎమోషన్, లవ్ అన్నీ కలగలిసిన ప్యాకేజ్‌గా డెకాయిట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్రబృందం చెబుతోంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
Recent Random Post:















