మెగాస్టార్ బర్త్‌డే ట్రిపుల్ ట్రీట్ రెడీ

Share


మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఎప్పటిలాగే భారీ అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి అయితే అభిమానుల ఆశలు నిజం కాబోతున్నట్టు సమాచారం. చిరంజీవి నటిస్తున్న మూడు సినిమాలకు సంబంధించిన సెన్సేషనల్ అప్‌డేట్స్ బర్త్ డే రోజున రానున్నాయి.

‘విశ్వంభర’ సినిమాకి సంబంధించి టీజర్‌ను ఆగస్టు 22న రిలీజ్ చేసేలా దర్శకుడు వశిష్ట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అదే రోజు రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించబోతున్నారని టాక్. ఈ రెండు అప్‌డేట్స్ మాత్రం ఫిక్స్ అయ్యాయని ఫిలిం నగర్‌లో వినిపిస్తోంది.

అదే సమయంలో అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి 157వ సినిమా నుంచి కూడా సర్ప్రైజ్ రానుంది. ఇప్పటికే చిరంజీవి కొత్త లుక్‌పై ఆసక్తి నెలకొని ఉండగా, అదే రోజు టైటిల్ రివీల్ చేసే అవకాశం ఉందని సమాచారం. స్లిమ్‌గా, స్టైలిష్‌గా మారిన చిరంజీవి లుక్ అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది.

ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ డబ్బింగ్‌లో బిజీగా ఉండగా, సీజీ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. మరోవైపు 157వ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయ్యింది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలన్నదే టార్గెట్‌గా మేకర్స్ ఫిక్స్ అయ్యారు.


Recent Random Post: