మోహన్ బాబుకు మంచు విష్ణు భావోద్వేగ నివాళి

Share


టాలీవుడ్‌లో మోహన్ బాబు పేరు ఓ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకుంది. అసలు పేరు భక్తవత్సల నాయుడు. సినీ రంగంలోకి రాకముందు శారీరక విద్యా ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన, మొదట డైరెక్షన్ విభాగంలో పని చేశారు. అనంతరం 1975లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు.

ఆ తర్వాత హీరోగా, విలన్‌గా, సహాయ పాత్రల్లో అనేక చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ స్థానం ఏర్పర్చుకున్నారు. ఆయన కుటుంబం కూడా సినీ రంగానికే అంకితమైంది. కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్, కుమార్తె లక్ష్మీ – ముగ్గురూ నటనలో కొనసాగుతున్నారు. మోహన్ బాబు క్రమశిక్షణకు మారుపేరు. అదే నిష్ఠను పిల్లల పెంపకంలోనూ పాటించారు.

అయితే ఇటీవలి కాలంలో మంచు ఫ్యామిలీ ఆంతర్య వివాదాలతో వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా మంచు మనోజ్‌–మోహన్ బాబు మధ్య వచ్చిన ఒడిదొడుకులు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన సంఘటనలు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యాయి. అప్పటిదాకా గౌరవించబడే మోహన్ బాబుకు ఈ వివాదాల వల్ల కొంత నెగెటివ్ పబ్లిసిటీ వచ్చిందనేది నిజం.

ఈ నేపథ్యంలో తాజాగా కన్నప్ప ప్రమోషన్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలు చాలా భావోద్వేగంగా ఉన్నాయి. “ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం మా నాన్నను హ్యాపీగా ఉంచడంపైనే. ఆయన ఎంతో కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆయనకు మంచి పేరు రాకపోయినా పర్లేదు, కానీ నా వల్ల చెడ్డ పేరు రాకూడదు. నా వల్ల ఆయన పరువు తక్కువైతే, బతకడం, చావడం రెండూ సమానమే,” అని అన్నాడు విష్ణు.

విష్ణు చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తండ్రిపై ఉన్న గౌరవాన్ని, బాధ్యతను ప్రతిబింబించాయి. ఈ కామెంట్లు మోహన్ బాబు–మనోజ్ మధ్య విభేదాలకైనా పూసగుచ్చినట్టు కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.


Recent Random Post: