
టాలీవుడ్ నుంచి దూరంగా నాలుగు సంవత్సరాలు గడిపిన రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్లో అవకాశాలతో బిజీగా ఉన్నప్పటికీ, భారీ విజయాలు లభించలేదు. నాలుగేళ్లలో ఆమె 8-9 హిందీ సినిమాలు చేసింది, కానీ ప్రేక్షకుల గుండెల్లో ముద్ర వేసే సక్సెస్ దొరకలేదు. ప్రస్తుతం ఆమె లైన్లో రెండు-మూడు ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, వాటిపై పెద్ద బజ్ లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో రకుల్ మళ్లీ టాలీవుడ్లో అడుగులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాత మేనేజర్‌తో మళ్లీ పని చేసి దర్శకులు, నిర్మాతలతో టచ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే, రామ్ చరణ్-ఉపాసన దంపతులతో స్నేహం ఉన్న రకుల్, వారి ద్వారా కూడా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది.
వాస్తవానికి, రకుల్ టాలీవుడ్లో అవకాశాలు ఉన్న సమయంలోనే బాలీవుడ్‌కి వెళ్లింది. పాన్ ఇండియా సినిమాల్లో స్థిరమైన ఛాన్సులు లభించకపోవడం, టాలీవుడ్లో కొందరు సీనియర్లకు అవకాశం ఇవ్వకపోవడం ఆమెకు నిరాశ కలిగించింది. పూజాహెగ్డే కూడా టాలీవుడ్ అవకాశాల కోసం గమ్యస్థానం మార్చి, కొలీవుడ్లో అవకాశాలు అందుకుంటూ comeback సాధించింది. రకుల్‌కు కూడా ఇలాంటి అవకాశాలు వస్తాయా లేదా అనేది చూడాలి.
ప్రస్తుతం రకుల్ హిందీలో “దే దే ప్యార్ దే 2” మరియు “పతీ పట్నీ ఔర్ హూ డూ” చిత్రాల్లో నటిస్తున్నారు. “దే దే ప్యార్ దే 2” రాబోయే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Recent Random Post:














