రణబీర్ కపూర్ కొత్త టార్గెట్ – ద‌ర్శ‌క‌త్వం వైపు అడుగులు

Share


రాక్‌స్టార్ రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిషి కపూర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్న అగ్ర నటుల్లో ఆయన ఒకరు. సావారియాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి, రెండు దశాబ్దాలుగా విభిన్న పాత్రల్లో నటిస్తూ, వందల కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు.

ఇప్పటివరకు కేవలం హీరోగానే రాణించిన రణబీర్, ఇప్పుడు దర్శకుడిగా మారే ఆలోచనలో ఉన్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. నటుడిగా మాత్రమే కాకుండా కెప్టెన్ కుర్చీపై కూర్చోవడం కూడా తన లక్ష్యాల్లో ఒకటని చెప్పాడు. ఇందుకోసం ఇప్పటికే రైటింగ్ వర్క్‌షాప్‌లకు హాజరవుతున్నట్టు కూడా రణబీర్ తెలిపాడు. వచ్చే రెండు సంవత్సరాల్లో దర్శకుడిగా మారడమే తన టార్గెట్ అని స్పష్టం చేశాడు.

ఈ వ్యాఖ్యలతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తింది. రణబీర్ నటుడిగా రిటైర్మెంట్ తీసుకుంటున్నాడా? లేదా హీరోగా, దర్శకుడిగా రెండింటినీ సమాంతరంగా కొనసాగించనున్నాడా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఇంతవరకు నటుడిగా, దర్శకుడిగా రెండింటినీ సమర్థంగా బ్యాలెన్స్ చేసి గొప్ప విజయాలు సాధించిన ఉదాహరణలు చాలా తక్కువే.

ఎస్. జె. సూర్య, గౌతమ్ మీనన్, రాఘవ లారెన్స్, ప్రభుదేవా వంటి వారు నటుడు-దర్శకుడిగా ప్రయత్నించినా, రెండింటినీ ఒకే స్థాయిలో నిలబెట్టడం సాధ్యం కాలేదు. కాబట్టి స్టార్ హీరో రణబీర్ కపూర్ తన సక్సెస్‌ఫుల్ ఇమేజ్‌ను వదిలి దర్శకుడి ప్రయాణం మొదలెడితే, ఆయన ఎదుర్కొనే సవాళ్లు చిన్నవిగా ఉండవు.


Recent Random Post: