
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం తన కెరీర్‌లో ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన మాస్ జాతర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భక్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో మాత్రం తన మార్క్ మాస్ హిట్ కొట్టాలని రవితేజ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్‌గా నటించగా, పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమా తర్వాత రవితేజ లైనప్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజ్ ఓ సినిమా చేయనున్నారని ఫిల్మ్‌నగర్‌లో జోరుగా టాక్ నడుస్తోంది. ఇప్పటికే శివ నిర్వాణతో కూడా ఓ ప్రాజెక్ట్ లాక్ అయ్యిందన్న ప్రచారం ఉన్నా, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే వివేక్ ఆత్రేయతో మాత్రం రవితేజ సినిమా ఉండటం దాదాపు ఖరారైనట్లు సమాచారం.
రవితేజ కోసం వివేక్ ఆత్రేయ ఓ ప్రత్యేకమైన హర్రర్ సబ్జెక్ట్ రెడీ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే కథను మాస్ మహారాజ్‌కు వినిపించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. సరిపోదా శనివారంతో నానితో సూపర్ హిట్ అందుకున్న వివేక్ ఆత్రేయ, ఈసారి హర్రర్ జానర్‌తో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయాలని భావిస్తున్నారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి, సరిపోదా శనివారం వంటి సినిమాలతో తన వైవిధ్యమైన కథనాన్ని ఇప్పటికే ప్రూవ్ చేసిన ఆయన, హర్రర్‌లోనూ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఆశ్చర్యకరంగా, రవితేజ తన ఇన్నేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు పూర్తిస్థాయి హర్రర్ సినిమాను చేయలేదు. షాక్ లాంటి చిత్రంలో లవ్ స్టోరీతో పాటు సస్పెన్స్ థ్రిల్ ఇచ్చినా, అది ఫుల్ ఫ్లెజ్డ్ హర్రర్ కాదు. ఈ నేపథ్యంలో వివేక్ ఆత్రేయతో రవితేజ చేయబోయే సినిమా ఒక డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్‌గా ఉండనుందని సమాచారం.
ఇక రవితేజ కూడా తన రెగ్యులర్ మాస్ పంథా సినిమాలకు కొంత విరామం ఇచ్చి, వెరైటీ స్టోరీస్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలని భావిస్తున్నారు. వివేక్ ఆత్రేయతో హర్రర్ ప్రాజెక్ట్‌తో పాటు, శివ నిర్వాణతో ఓ క్రైమ్ స్టోరీని కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ధమాకా తర్వాత సరైన సక్సెస్ లేక కాస్త వెనకబడిన మాస్ మహారాజ్‌కు ఈ కొత్త ప్రయత్నాలు ఎంతవరకు పాజిటివ్ రిజల్ట్ ఇస్తాయో చూడాలి. అయితే ఫ్యాన్స్ మాత్రం రవితేజ మళ్లీ హిట్ ట్రాక్‌లోకి రావాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.
Recent Random Post:















