రవితేజ కొత్త ప్రయోగం – సోషియో ఫాంటసీ థ్రిల్లర్

Share


ధమాకాతో బౌన్స్ బ్యాక్ అయినా ఆ విజయాన్ని కొనసాగించలేకపోయిన మాస్ రాజా రవితేజ వరుస ప్లాప్‌లతో ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్నాడు. టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, మిస్టర్ బచ్చన్, ఈగల్—ఈ చిత్రాలన్నీ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. అయితే, రవితేజ మాత్రం కొత్త అవకాశాలను అందుకోవడంలో వెనుకడుగు వేయడం లేదు. ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ జాతర అనే మాస్ ఎంటర్టైనర్‌లో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో రవితేజ మార్క్ మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండనున్నాయి. యాక్షన్, డైలాగ్ డెలివరీ, మాస్ సాంగ్స్—అన్ని రవితేజ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటాయి. మరోసారి శ్రీలీల రవితేజకు జోడీగా నటిస్తుండటం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. మార్కెట్ పరంగా కొంత ప్రతికూలత ఎదురవుతున్నా, మాస్ జాతర విడుదలకు ముందే రవితేజ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టేశాడు.

ఈసారి రవితేజ తన స్టైల్‌కు భిన్నంగా కొత్త జానర్‌ను ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాడు. ప్రముఖ నిర్మాత నాగవంశీ (సితార ఎంటర్టైన్మెంట్స్) రవితేజతో ఓ భారీ సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందనుందని సమాచారం. ఇప్పటివరకు రవితేజ ఎక్కువగా మాస్ ఎంటర్టైనర్స్‌కే పరిమితమయ్యాడు. కొత్త ప్రయోగాలకు ఎక్కువగా ఆసక్తి చూపించలేదు. కానీ ఈసారి నాగవంశీతో కలిసి డిఫరెంట్ జానర్‌లో అడుగుపెడుతున్నాడు.

ఇప్పటి యువ నిర్మాతల్లో నాగవంశీ తన విభిన్న కథా ఎంపికలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. హీరో కంటే కథను నమ్మి సినిమాలు రూపొందించడంలో తనదైన ముద్ర వేశారు. దిల్ రాజు తర్వాత కంటెంట్ బేస్డ్ కమర్షియల్ సినిమాలను విజయవంతంగా ప్రూవ్ చేస్తున్న నిర్మాతగా నిలిచారు. రవితేజతో తీసుకోబోయే ఈ చిత్రం రూటీన్ మాస్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, అతని కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని తెరవనుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.


Recent Random Post: