రష్మిక మందన్నా తో భారీ పాన్ ఇండియా మూవీ?

Share


రష్మిక మందన్నా నేడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన ఆమె, యానిమల్ మరియు పుష్ప వంటి భారీ హిట్ సినిమాల విజయంతో తన స్థాయిని విపరీతంగా పెంచుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంటూ, వందల కోట్ల ప్రాజెక్టులలో భాగమవుతోంది. త్వరలో సల్మాన్ ఖాన్ సరసన నటించిన సికిందర్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

ఇక సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ అందరూ రష్మికతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె పేరు ఓ సినిమాలో ఉండటం సినిమాకు అదనపు బలంగా మారుతోంది. అందుకే నిర్మాతలు వ్యాపార కోణంలో రష్మికను టాప్ ప్రాధాన్యతగా తీసుకుంటున్నారు. అలాగే, ఆమె నటనా సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేకర్స్ ఆమె డేట్స్ కోసం ఎదురుచూసే స్థాయికి ఎదిగింది.

ఈ నేపథ్యంలో రష్మిక క్రేజ్‌ను ఉపయోగించుకోవాలని భావించిన ఓ బిగ్ ప్రొడక్షన్ హౌస్, ఆమెను లీడ్ రోల్‌లో పెట్టి ఓ పాన్ ఇండియా లేడీ ఓరియంటెడ్ సినిమా రూపొందించేందుకు ప్లాన్ చేస్తోందట. ఈ ప్రాజెక్ట్ కోసం భారీ బడ్జెట్ కేటాయించాలని, ₹70-100 కోట్ల రేంజ్‌లో సినిమా తీయడం లాభదాయకమవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఆమె మార్కెట్ బలంగా ఉండటంతో, ఈ సినిమా భారీ స్థాయిలో బిజినెస్ చేయగలదని ప్రొడ్యూసర్స్ ఆశిస్తున్నారు.

ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి నిర్మాణ సంస్థ ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం యూవీ క్రియేషన్స్ అని తెలుస్తోంది. ప్రస్తుతం అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో ఘాటి అనే లేడీ ఓరియంటెడ్ సినిమా నిర్మిస్తున్న ఈ బ్యానర్, ఇప్పుడు రష్మికతో మరో భారీ సినిమా కోసం ముందడుగు వేస్తోందట.

అయితే, ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వాలంటే రష్మిక పూర్తిస్థాయిలో డేట్లు కేటాయించాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఆమె విపరీతంగా బిజీగా ఉండటంతో, ఏదైనా ఓ సినిమా వదులుకోవాల్సిన పరిస్థితి రావొచ్చని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని సమాచారం. ఒకవేళ ఇది అమలులోకి వస్తే, రష్మిక కెరీర్‌లో మరో కీలక మలుపు కానుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.


Recent Random Post: