
సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఆయన విదేశాలకు బయలుదేరుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భార్య నమ్రత, పిల్లలతో కలిసి కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పటిలాగే మహేష్ బాబు చాలా కూల్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తూ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సాధారణంగా రాజమౌళి సినిమాల్లో నటిస్తున్న హీరోలు పూర్తిగా బయట ప్రపంచానికి దూరంగా ఉండాల్సిందే అన్న అభిప్రాయం ఉంది. ముఖ్యంగా వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ విషయంలో మహేష్ బాబుకు అస్సలు ఖాళీ దొరకదని అందరూ ఫిక్స్ అయ్యారు. షూటింగ్‌కే పూర్తి సమయం కేటాయిస్తారని భావించారు. అలాంటిది అనూహ్యంగా మహేష్ ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన కొత్తలో సోషల్ మీడియాలో ఒక రేంజ్లో మీమ్స్ ట్రెండ్ అయ్యాయి. జక్కన్న వర్కింగ్ స్టైల్ తెలిసిన నెటిజన్లు..
“ఇక మహేష్ బాబు పాస్‌పోర్ట్ రాజమౌళి దగ్గరే లాక్ అయిపోయింది”,
“ఎక్కడికీ వెళ్లే ఛాన్స్ లేదు” అంటూ సరదాగా జోకులు పేల్చారు. కానీ ఆ జోకులన్నింటికీ చెక్ పెడుతూ మహేష్ తనదైన స్టైల్లో ఫ్యామిలీ టైమ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో “ఈ రౌండ్లో జక్కన్న మీద మహేష్ గెలిచాడు” అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సాధారణంగా ఏ హీరోకూ సాధ్యం కానిది, మహేష్ బాబుకే సాధ్యమైందని ఫ్యాన్స్ అంటున్నారు. షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరకడం, అదీ పండగ సమయంలో వెకేషన్‌కు వెళ్లడం చూస్తుంటే.. రాజమౌళి కూడా మహేష్ కోసం కొంత షెడ్యూల్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చినట్లు అనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మహేష్ వెకేషన్ ఫోటోలు చూసి ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ సరదాగా జెలస్ అవుతున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాల కోసం వాళ్లు ఏళ్ల తరబడి కష్టపడి, ఫ్యామిలీకి కూడా సరైన టైమ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటిది మహేష్ మాత్రం సినిమా చేస్తూనే పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం చూసి, నెటిజన్లు కొత్త కొత్త మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
మొత్తానికి ఈ ట్రిప్‌తో మీమర్స్‌కు ఒక క్లారిటీ వచ్చేసింది. రాజమౌళి సినిమా ఉన్నా సరే తన వెకేషన్స్ ఆపేదే లేదని సూపర్ స్టార్ మరోసారి ప్రూవ్ చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకుని తిరిగొచ్చాక.. మహేష్ పూర్తిస్థాయిలో జక్కన్న ప్రపంచంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
ఇక ‘వారణాసి’ సినిమాలో మహేష్ రుద్ర అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్ 2027 సమ్మర్లో విడుదల కానుంది.
Recent Random Post:















