
నితేష్ తివారీ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న పురాణ ఇతిహాస చిత్రం రామాయణం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, కేజీఎఫ్ ఫేమ్ యష్ రావణుడిగా నటిస్తుండగా, సాయిపల్లవి సీతాదేవి పాత్రలో కనిపించనుంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌కు అద్భుత స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇప్పుడు అభిమానుల చూపంతా తొలి అధికారిక పోస్టర్‌పై నిలిచింది. తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ మార్చి 2026లో మొదటి క్యారెక్టర్ పోస్టర్‌లను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా మార్చి 27, 2026 – శ్రీరామ నవమి రోజున ఈ పోస్టర్‌లను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీరాముడి జన్మదినోత్సవాన్ని ఎంచుకోవడం భారతీయుల భావోద్వేగాలతో ముడిపడిన నిర్ణయంగా భావిస్తున్నారు. సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ రోజు పోస్టర్‌లను రిలీజ్ చేయడం సినిమాకు మరింత పవిత్రత, విశిష్టత తీసుకొస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.
ఈ పోస్టర్‌లలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా రూపాంతరం చెందిన ఫస్ట్ లుక్, యష్ యొక్క శక్తివంతమైన రావణుడి అవతారం, అలాగే సీతాదేవిగా సాయిపల్లవి యొక్క తొలి అధికారిక లుక్‌ను రివీల్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రామాయణం – పార్ట్ 1 చిత్రీకరణ 2025 చివర్లోనే పూర్తికాగా, ప్రస్తుతం చిత్ర బృందం అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులపై దృష్టి సారించింది. ఈ వీఎఫ్‌ఎక్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన DNEG సంస్థ రూపొందిస్తోంది. 2026 వేసవి నాటికి ఫైనల్ కట్‌ను సిద్ధం చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇప్పటికే విడుదల తేదీలపై కూడా క్లారిటీ ఇచ్చారు. రామాయణం పార్ట్ 1ను దీపావళి 2026కి, పార్ట్ 2ను దీపావళి 2027కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, హాలీవుడ్ మాస్ట్రో హాన్స్ జిమ్మర్తో కలిసి ఆయన పనిచేస్తున్నారు. ఈ సినిమాతో హాన్స్ జిమ్మర్ బాలీవుడ్‌లో అరంగేట్రం చేయడం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది.
Recent Random Post:















