రామాయణ సినిమాతో బాలీవుడ్‌లో చరిత్ర సృష్టి!

Share


బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ‘రామాయణ’. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు.

ఇటీవలి ప్రమోషన్స్‌లో దర్శకుడు అశ్విన్ కుమార్ రామాయణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తెరకెక్కిస్తున్న ‘మహావతార్: నరసింహ’ సినిమా జూలై 25న విడుదల కానుంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా విష్ణుమూర్తి పది అవతారాలపై రూపొందే సిరీస్‌లో తొలి సినిమా. మొత్తం ఏడుగురు అవతారాలపై సినిమాలు రూపొందనున్నాయని ఆయన తెలిపారు.

ప్రచార కార్యక్రమంలో అశ్విన్ మాట్లాడుతూ, “రామాయణం లాంటి కథలు ఎన్ని సార్లు వచ్చినా ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిగా చూస్తారు. గతంలో వచ్చిన ఆదిపురుష్ విఫలమైనా, దానికి కారణాలు వేరే ఉన్నాయి. కానీ ఆ సినిమా నుంచి ఇండస్ట్రీ ఎన్నో పాఠాలు నేర్చుకుంది. అదొక్కటే ముగింపు కాదు, రామాయణంపై ఇంకా ఎన్నో గొప్ప సినిమాలు చేయవచ్చు,” అని అన్నారు.

“ఈసారి రామాయణ చిత్రం తప్పకుండా బాలీవుడ్‌లో చరిత్ర సృష్టిస్తుంది. ఓ సినిమా విజయం బడ్జెట్‌తో మాత్రమే కాదు, కథను ఎలా చూపించామన్నదే ముఖ్యమైనది. ‘మహావతార్: నరసింహ’కు కూడా అదే ప్రధాన ఉద్దేశం. పురాణాల కథలు ఆధారంగా తెరకెక్కే సినిమాలకి మరింత డిమాండ్ వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి” అని అశ్విన్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.


Recent Random Post: