
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సన సమక్షంలో తెరకెక్కుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీపై రోజుకో క్రేజీ అప్డేట్ వస్తోంది. సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే, హీరో ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారుడో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం, రామ్ చరణ్ పాత్ర ఓ ఆల్‌రౌండర్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. క్రికెట్, కుస్తీ, కబడ్డీ, మల్లయుద్ధం లాంటి అనేక రకాల క్రీడల్లో తన ప్రతిభను చూపించేలా ఈ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దినట్లు టాక్.
గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్ అన్నీ బ్యాలెన్స్ చేసి చూపించేలా బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడు. రామ్ చరణ్ లుక్ కూడా దానికి తగ్గట్టుగా గుబురు గడ్డంతో, మాస్ అప్పీల్ ఉన్న హీమ్యాన్ లా డిజైన్ చేశారు. షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే శివరాజ్ కుమార్ భాగమైన సీన్స్ కంప్లీట్ అయ్యాయి. జాన్వీ కపూర్ కూడా షూటింగ్లో జాయిన్ అయింది. ఇతర నటీనటులతో కూడిన కీలక సన్నివేశాలు చకచకా పూర్తి చేస్తున్నారు.
సినిమా విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు. ఫ్యాన్స్ మాత్రం “గేమ్ చేంజర్” గట్టిగా ప్రభావితం కాకముందే ఈ సినిమాతో రికార్డ్స్ బద్దలు కొట్టాలని కోరుకుంటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇంకో రెండు పాటలు కంపోజ్ చేయాల్సి ఉంది. ఆయన ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పటికీ, కోలుకున్న తర్వాత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనిని పూర్తి చేయనున్నారు.
మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా #RC16 టీజర్ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి టీజర్ కంటే కొత్త పోస్టర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని టాక్. సినిమా మీద అంచనాలు ఇప్పటికే తారాస్థాయిలో ఉన్న నేపథ్యంలో, బుచ్చిబాబు ఈ సినిమాను ఒక పవర్ఫుల్ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించేందుకు శ్రమిస్తున్నారు.
Recent Random Post:















