
Raashii Khanna ఇప్పుడు పూర్తిగా కొత్త అవతారంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గ్లామర్ పాత్రలతో అలరించే ఈ టాలీవుడ్ బ్యూటీ, ఈసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా యాక్షన్ మోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన తాజా వెబ్ సిరీస్ Lukhhe నేటి నుంచే Amazon Prime Video
లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రాశీ “గుర్బానీ” అనే ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపిస్తూ తనలోని కొత్త కోణాన్ని చూపిస్తోంది.
ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా రాశీ ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పోలీస్ యూనిఫామ్‌లో చేతిలో గన్ పట్టుకుని ఆమె ఇచ్చిన స్టైలిష్ పోజులు ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. క్యూట్ లుక్స్‌తో మెప్పించే రాశీ, ఈసారి ఫెరోషియస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్‌లో రాశీ తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. “గుర్బానీ చాలా షార్ప్ క్యారెక్టర్. తన భావోద్వేగాలను బయటకు చూపించకుండా లోపలే యుద్ధం చేసే వ్యక్తిత్వం ఆమెది” అని తెలిపింది. షూటింగ్ పూర్తయ్యాక కూడా ఆ పాత్ర తన మనసులోనే ఉండిపోయిందని చెప్పడంతో, ఈ పాత్ర కోసం ఆమె ఎంతగా కష్టపడిందో అర్థమవుతోంది.
ఈ వెబ్ సిరీస్‌లో రాశీ ఖన్నాతో పాటు Lakshvir Saran, Palak Tiwari, Nakul Roshan Sahdev కీలక పాత్రలు పోషించారు. అలాగే Yograj Singh, Ayesha Raza Mishra వంటి సీనియర్ నటీనటులు కూడా ఈ సిరీస్‌లో కనిపించనుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రైమ్ డ్రామాను Agrim Joshi, Deobojit Das Purkayastha రూపొందించగా, దర్శకుడు Himank Gaur స్టైలిష్‌గా తెరకెక్కించారు.
ఇప్పటికే Farziతో ఓటీటీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశీ ఖన్నా, ఇప్పుడు “లుక్కే”తో మరో హిట్ అందుకునేలా కనిపిస్తోంది. యాక్షన్, క్రైమ్, ఎమోషన్స్ కలిసిన ఈ సిరీస్‌లో ఆమె చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి. గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్న రాశీ ఖన్నా ఈసారి “ఖతర్నాక్” పోలీస్ ఆఫీసర్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Recent Random Post:















