
‘సప్తసాగరదాచే ఎల్లో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రుక్మిణి వసంత్ తక్కువ కాలంలోనే మూడు భాషల్లో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే తెలుగు డెబ్యూ మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, అలాగే తమిళంలో వచ్చిన ఏస్, మధరాసి సినిమాలు ఆశించిన విజయాన్ని ఇవ్వకపోవడంతో నిరాశను మిగిల్చాయి.
ప్రస్తుతం రుక్మిణి తన దృష్టిని మళ్లీ కన్నడ ఇండస్ట్రీపై పెట్టింది. కాంతార: చాప్టర్ 1, టాక్సిక్ సినిమాల్లో నటిస్తున్న ఆమె, ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కానున్నాయి. సినిమాలపై ఉన్న అంచనాల దృష్ట్యా రుక్మిణి తన ఖాతాలో మరోసారి పెద్ద హిట్లు వేసుకునే అవకాశం ఉందని ఫిలింనగర్లో చర్చ నడుస్తోంది.
ఇక టాలీవుడ్లో ఆమె రెండో చిత్రం ఎన్టీఆర్‌తో వస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న పాన్ ఇండియా మూవీ డ్రాగన్ లో హీరోయిన్గా రుక్మిణి నటిస్తోంది. ప్రశాంత్ సినిమాల్లో హీరోయిన్‌కి పెద్ద ప్రాముఖ్యత ఉండదనే అభిప్రాయం ఉన్నప్పటికీ, ఈ సినిమాలో మాత్రం రుక్మిణి పాత్ర ప్రత్యేకంగా నిలుస్తుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కారణంగా రుక్మిణి క్రేజ్ టాలీవుడ్లో కూడా పెరిగింది.
ఒకేసారి మూడు పాన్ ఇండియా మూవీస్‌లో నటిస్తున్న రుక్మిణి అదృష్టం గురించి అభిమానులు, సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలు విజయవంతం అయితే ఆమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఎదగడం ఖాయమని విశ్వాసం వ్యక్తం అవుతోంది. తెలుగులో, తమిళంలో తొలి సినిమాలతో ఫ్లాప్ టేస్ట్ చూసిన రుక్మిణి, ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేస్తున్న డ్రాగన్ సినిమాతో ఆ సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తుందా అన్నది చూడాలి.
Recent Random Post:















