
కొంతమంది హీరోలకు సినిమాల రిలీజ్‌లు అతివృష్టిలా లేదా అనావృష్టిలా ఉంటాయి. అలాంటి వారిలో అల్లరి నరేష్ ఒకరు. గత ఏడాది ఆయన వరుసగా మూడు చిత్రాల్లో కనిపించాడు. నా సామి రంగా విజయాన్ని నాగార్జున తన ఖాతాలో వేసుకోగా, అదక్కు మరియు బచ్చల మల్లి మాత్రం నిరాశపరిచాయి. దీంతో కామెడీ చేయాలో, సీరియస్ రోల్స్ చేయాలో అర్థం కాక కొంత విరామం తీసుకున్నాడు నరేష్. ఆ గ్యాప్ దాదాపు పది నెలలకు చేరింది.
ఇప్పుడు అయితే అల్లరోడు మళ్లీ ఫుల్ జోష్‌లోకి వచ్చాడు. కేవలం 40 రోజుల వ్యవధిలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మొదటగా నవంబర్ 21న విడుదల కానున్నది 12 రైల్వే కాలనీ. పొలిమేర సిరీస్ క్రియేటర్ అనిల్ విశ్వనాథ్ కథ అందించిన ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతోంది. చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగా ఉండబోతున్నాయని టీమ్ చెబుతోంది.
ఇక కొత్త సంవత్సరాన్ని అల్లరి నరేష్‌నే బోణీ చేయబోతున్నాడు. 2026 జనవరి 1న విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం ఆల్కహాల్. ఇందులో నరేష్ మందు తాగకుండానే స్నేహితులను “మందు మూడ్”లోకి నెట్టే వెరైటీ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుండటంతో కంటెంట్‌పై మంచి నమ్మకం ఉంది.
సంక్రాంతి రేస్‌లో భారీ సినిమాలు ఉన్నప్పటికీ, పది రోజుల ముందే రిలీజ్ అవుతున్న ఆల్కహాల్కు మంచి అదనపు లాభం ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వబోతుందని టీమ్ నమ్మకం వ్యక్తం చేస్తోంది.
ఈ రెండు సినిమాలు అల్లరి నరేష్ కెరీర్‌కి కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా సోలో హీరోగా ఆయన మార్కెట్ డౌన్ అయినప్పటికీ, దర్శకులు, నిర్మాతలు ఆయనపై నమ్మకం ఉంచుతున్నారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే హిట్‌లు తప్పనిసరిగా కావాలి.
ఇప్పటికీ అభిమానుల్లో నరేష్‌కి మంచి గుడ్‌విల్ ఉంది. సరైన కథ, కాంబినేషన్ దొరికితే తన సత్తా చూపగలడనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఈ రెండు చిత్రాలు విజయవంతం కావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ప్రస్తుతం ఈ రెండు సినిమాలకూ ప్రత్యేక ప్రమోషన్‌లు ప్లాన్ చేస్తున్నారు. మరి 12 రైల్వే కాలనీలో సస్పెన్స్‌తో, ఆల్కహాల్లో వినోదంతో అల్లరి నరేష్ ఎలాంటి మేజిక్ చూపిస్తాడో చూడాలి.
Recent Random Post:















