
వయసు అర్థ సెంచరీ దాటినా, అజిత్ మోటార్‌స్పోర్ట్స్‌లో దూసుకుపోతూనే ఉన్నాడు. రేస్ ట్రాక్‌పై తన అదిరే పర్ఫార్మెన్స్‌తో కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు. ఇప్పటికే దుబాయ్ కార్ రేస్ ఈవెంట్‌లో విజయం సాధించిన అజిత్, తాజాగా స్పెయిన్‌లో మరో ఘనత సాధించాడు. ఇది అతడి వేగానికి ఎవ్వరూ సాటిలేరని నిరూపిస్తుంది.
15 ఏళ్ల విరామం తర్వాత కార్ రేసింగ్‌లో తిరిగి ఎంట్రీ ఇచ్చిన అజిత్, ఇప్పుడు మోటార్‌స్పోర్ట్స్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్నాడు. దుబాయ్ రేసులో విజయం సాధించిన అనంతరం, అతడి బృందం పోర్చుగల్‌లోని పోర్స్చే స్ప్రింట్ ఛాలెంజ్‌లో పాల్గొంది. అక్కడ 1.49.13 సెకన్ల వ్యక్తిగత ఉత్తమ ల్యాప్ సమయాన్ని సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ప్రస్తుతం స్పెయిన్‌లోని వాలెన్సియా సర్క్యూట్‌లో తన రికార్డును మరింత మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అజిత్ రేసింగ్ బృందం X (ట్విట్టర్) ద్వారా తాజా అప్‌డేట్ ఇచ్చింది. ప్రాక్టీస్ సమయంలో అజిత్ 1:39.9 ల్యాప్ సమయం సాధించాడని ప్రకటించింది. అనుభవం పెరిగే కొద్దీ తన పరిమితులను దాటి మరింత వేగంగా రేస్ చేస్తున్నాడు.
ఈ సీజన్ ముగిసే వరకు ఎటువంటి కొత్త సినిమాలు చేయబోనని అజిత్ స్పష్టం చేశాడు. అయితే అక్టోబర్ – మార్చి మధ్య ఓ కొత్త ప్రాజెక్ట్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అప్పటి వరకు, అతడు పూర్తిగా రేసింగ్ ట్రాక్‌పై దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు!
Recent Random Post:















