లిటిల్ హార్ట్స్‌తో లైమ్‌లైట్‌లోకి ధీరా రెడ్డి

Share


సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఆర్టిస్టులు చిన్న పాత్రలతోనే ప్రేక్షకులను అలరిస్తూ overnightగా గుర్తింపు తెచ్చుకుంటారు. పెద్ద హీరోలు, హీరోయిన్‌లు కాకపోయినా, తమకు దొరికిన చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఇమేజ్ సంపాదించగలిగిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో తాజాగా పేరు తెచ్చుకుంటున్నది ధీరా రెడ్డి.

‘లిటిల్ హార్ట్స్’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ధీరా రెడ్డి, క్లైమాక్స్‌లో హీరోయిన్ చెల్లెలుగా కొన్ని నిమిషాల స్క్రీన్ స్పేస్‌తోనే అందరి హృదయాలను దోచేసింది. ఆమె అందం, న్యాచురల్ ఆకర్షణ చూసి ప్రేక్షకులు వెంటనే ఎవరో తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు, వివరాలు వైరల్ అవుతున్నాయి.

ఇక ఆమె బ్యాక్‌గ్రౌండ్ విషయానికి వస్తే— ధీరా 2018లో మిస్ తెలంగాణ ఫస్ట్ రన్నరప్ టైటిల్ గెలుచుకుంది. క్లాసికల్ డాన్సర్‌గా, మోడల్‌గా గుర్తింపు పొందిన ఆమె ఇప్పుడు సినిమాల వైపు అడుగులు వేస్తోంది. ‘లిటిల్ హార్ట్స్’తో మొదటి బ్రేక్ దక్కించుకుంది.

ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీని ఓపెన్ చేస్తే గ్లామరస్, ట్రెడిషనల్ లుక్స్ రెండింటిలోనూ ఆకట్టుకునే ఫోటోలు కనిపిస్తాయి. అందుకే నెటిజన్లు ఆమెను “పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్” అని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉన్న ఆమెకు ఈ సినిమాతో మరింత అభిమాన వర్గం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చిన్న పాత్ర అయినా సరే సరైన రోల్ దొరికితే, అది ఎలా స్టార్‌ డమ్‌ తెస్తుందో ధీరా రెడ్డి మరోసారి నిరూపించింది అని చెప్పాలి.


Recent Random Post: