వయొలెన్స్ నాని… క్లాస్ ఫ్యాన్స్‌కు స్వీట్ వార్నింగ్!

Share


నేచురల్ స్టార్ నాని తన కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా క్లాస్ టచ్ ఉన్న కథలతోనే ప్రేక్షకులను అలరించాడు. ‘అష్టాచమ్మా’ నుంచి ‘జెంద పి’ వరకూ ఆయ‌న సినిమాల‌కు ఒక ఫీల్‌గుడ్ అటిట్యూడ్ ఉండేది. ఫ్యామిలీ ఆడియన్స్‌లో నానికి ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉండటం కూడా అందుకే. కానీ ‘ఎంసీఏ’, ‘నేను లోకల్’లతో మాస్ బేస్‌ను కూడా అందుకున్న నాని, ‘దసరా’తో ఆ ఇమేజ్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లాడు.

ఇప్పుడు నాని నుంచి వస్తున్న ‘హిట్-3’ మాత్రం చాలా వయొలెంట్‌గా ఉంది. ట్రైలర్‌ చూస్తేనే తెలుస్తోంది—ఇది మామూలు యాక్షన్ సినిమా కాదు. అందుకే నాని కూడా అభిమానులకి ముందుగానే ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చేశాడు. వైజాగ్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ,
“యాక్షన్ నాని కోసం ఎదురు చూస్తున్నవాళ్లు మే 1న థియేటర్లకు రావాలి. ఫీల్‌గుడ్, ఫన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ల కోసం చూస్తున్నవాళ్లు ఆ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి,” అని చెప్పారు.

ఇదే కాకుండా,
“నాని అన్ని జానర్స్‌లో ప్రయోగాలు చేయగలడు అనే నమ్మకంతో ఉన్నవాళ్లు మా ‘హిట్-3’ను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది టాలీవుడ్‌కి కొత్త వయొలెన్స్ థ్రిల్లర్ జానర్‌ను పరిచయం చేస్తుంది,” అని నాని స్పష్టం చేశారు.

వైజాగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ,
“15 ఏళ్ల క్రితమే మొదటిసారి ఇక్కడికి వచ్చాను – ఒక అమ్మాయిని కలవడానికి. ఆమే తర్వాత నా భార్య అయ్యింది. అప్పటినుంచి ఈ నగరంతో నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. వైజాగ్‌కి వచ్చినప్పుడు నన్ను ఇక్కడవాళ్లు అల్లుడిలా చూసుకుంటారు. అది నాకు ఎప్పటికీ స్పెషల్‌గా ఉంటుంది,” అన్నారు.


Recent Random Post: