మలయాళ సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా అగ్రహీరోగా కొనసాగుతున్న మోహన్‌లాల్ తన వారసులను సినీ రంగానికి పరిచయం చేయడం ప్రారంభించాడు. ఇప్పటికే తన కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ హృదయం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన కుమార్తె విస్మయ మోహన్‌లాల్ కూడా సినీ రంగ ప్రవేశానికి రెడీ అయింది.
విస్మయ నటిగా ఎంట్రీ ఇవ్వబోయే సినిమా పేరే “తుడక్కమ్”. ఈ విషయాన్ని మోహన్‌లాల్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. “డియర్ మాయ కుట్టీ… తుడక్కమ్ సినిమాతో నువ్వు వేయబోతున్న అడుగులు విజయం సాధించాలనీ కోరుకుంటున్నాను” అంటూ మోహన్‌లాల్ ప్రేమపూర్వకంగా ట్వీట్ చేశాడు.
ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై మోహన్‌లాల్‌కు అత్యంత సన్నిహితుడైన ఆంటోనీ పెరుమ్బవూర్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. 2018 ఫేమ్ జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకుడిగా బాధ్యతలు నిర్వహించనున్నాడు. సినిమా ప్రకటనతో పాటు ఓ పోస్టర్‌ను కూడా మోహన్‌లాల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే, సాధారణంగా స్టార్ కిడ్స్ చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. కానీ విస్మయ మాత్రం 30 ఏళ్లు దాటిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. మరింత ఆసక్తికర విషయం ఏమిటంటే, సినీ కెరీర్ కోసం ఆమె ఏకంగా 22 కేజీల బరువు తగ్గింది, ఇది మలయాళ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
విస్మయకు ఉన్న నటనపై ఆసక్తి, ఆమె చూపిన పట్టుదల చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆలస్యమైన ఎంట్రీ ఆమెకు ఏ స్థాయి విజయాన్ని తీసుకువస్తుందో చూడాలి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్మయ సినీ ఎంట్రీపై హాట్ టాపిక్ నడుస్తోంది. మోహన్‌లాల్ కూతురిగా కాకుండా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటేనే ఆమె నిజమైన విజయం అందుకున్నట్లు అవుతుంది.
Recent Random Post: