
రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి బ్లాక్‌బస్టర్లతో సంచలనం సృష్టించిన యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కోసం ఇప్పుడు స్టార్ హీరోలు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని సినీ పరిశ్రమలు సందీప్ ట్యాలెంట్‌కి ఫిదా అయ్యాయి. టాప్ హీరోలు అందరూ అతనితో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తన లైనప్‌ను ప్రకటించిన సందీప్, ముందుగా ప్రభాస్‌తో స్పిరిట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత రణబీర్ కపూర్‌తో యానిమల్ పార్క్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు.
ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ ఎవరితో సినిమా చేస్తాడు? అనే విషయం ఇప్పట్లో తేలేలా లేదు. అయితే టాలీవుడ్‌లో మాత్రం ఆయన కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య పోటీ మొదలైందని టాక్ వినిపిస్తోంది. ఇద్దరూ సందీప్‌ను టచ్‌లో ఉంచుకుని, తమ తదుపరి చిత్రాన్ని తనతోనే చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. చరణ్ తన లైనప్ పూర్తయిన వెంటనే సందీప్‌తో సినిమా చేయాలని భావిస్తుండగా, అల్లు అర్జున్ కూడా తన స్నేహితుడు ప్రభాస్ తర్వాత సందీప్‌తో కలిసి పని చేయాలని పట్టుదలగా ఉన్నాడట.
ఈ పోటీ ఎంత దూరం వెళ్లేది తెలియదుగానీ, ఇద్దరూ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం వారి ప్రాజెక్ట్‌లను పరిశీలిస్తే, ఎవరికీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయో అంచనా వేయవచ్చు.
ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది, ఇది వేసవిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇది పాన్-ఇండియా ప్రాజెక్ట్, ఆ తర్వాత ఆయన మరే డైరెక్టర్‌తోనూ కమిట్ కాలేదు. మరోవైపు, రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో తన 16వ సినిమాను చేస్తున్నాడు. దీని తర్వాత 17వ చిత్రాన్ని సుకుమార్‌తో మొదలు పెట్టనున్నాడు. ఈ రెండు చిత్రాలు విడుదల అయ్యే లోపే సందీప్ తన రెండు సినిమాలను పూర్తిచేసి సిద్ధంగా ఉండాలి.
ఈ క్రమంలో సందీప్‌తో సినిమా చేసేందుకు చరణ్ ఆసక్తిగా ఉన్నా, అతను ముందుగా తన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు హీరోలు సందీప్ కోసం వెయిట్ చేయాలి, కాని సందీప్ మాత్రం ఎవరికి కోసం కూడా ఆగే పరిస్థితిలో లేడు. ఇక అల్లు అర్జున్ కోణంలో చూస్తే, అతనికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తోంది. ప్రస్తుతం బన్నీ చేతిలో త్రివిక్రమ్ సినిమా మాత్రమే ఉంది. దీన్ని కూల్‌గా పూర్తి చేసి, ఆ తర్వాత ఏడాది పాటు సందీప్ కోసం వెయిట్ చేసే అవకాశమూ ఉంది.
సందీప్ తదుపరి చిత్రం ఎవరితో అనేది ఇంకా స్పష్టత రాకపోయినా, టాలీవుడ్‌లో రామ్ చరణ్ vs అల్లు అర్జున్ రేస్ ఆసక్తికరంగా మారింది. మరి చివరికి ఈ గేమ్‌లో విజయం సాధించేది ఎవరు? అనేది వేచిచూడాల్సిందే!
Recent Random Post:















