సంయుక్త మీనన్ తాజా గ్లామర్ & సినిమా అప్‌డేట్

Share


ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అమాయకమైన లుక్‌తో కనిపిస్తూనే, తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ, తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్‌లో వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలో రానా భార్య పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసింది.

సంయుక్త మీనన్ 2016లో పాప్‌కార్న్ అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒక్కో భాషలో విభిన్నమైన పాత్రలు చేస్తూ, నటిగా మరింత మెరుగవుతూ ముందుకెళ్తోంది.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈమె బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల తరచూ గ్లామర్ ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ట్రాన్స్పరెంట్ డ్రెస్‌లో చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొంటెగా ఇచ్చిన ఫోజులు, ఆకట్టుకునే లుక్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ “కొంచెం సాఫ్ట్… కొంచెం హాట్” అనే క్యాప్షన్ జోడించగా, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

2022లో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారలో హీరోయిన్‌గా మెప్పించిన సంయుక్త, 2023లో వచ్చిన తెలుగు-తమిళ్ బైలింగ్వల్ చిత్రం సార్లో టీచర్ పాత్రలో తన నటనతో మరోసారి ప్రశంసలు అందుకుంది. గతేడాది చివర్లో నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ 2లో నటించి ఆకట్టుకుంది. ఈ ఏడాది శర్వానంద్ సరసన నారీ నారీ నడుమ మురారి సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది.

అయితే ఈ సినిమా సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలవాల్సి ఉన్నప్పటికీ, అదే సమయంలో పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేయడంతో సరైన థియేటర్లు దొరకలేదు. కంటెంట్ బాగున్నా, కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదనే టాక్ వినిపించింది.

ప్రస్తుతం సంయుక్త మీనన్ నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారిక పోస్టర్‌తో ప్రకటించారు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

ఇవే కాకుండా ఒక తమిళ్, ఒక మలయాళం చిత్రంతో పాటు విజయ్ సేతుపతి నటిస్తున్న సినిమాలో కూడా సంయుక్త భాగమవుతోంది. మొత్తానికి ఒకవైపు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే, మరోవైపు తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది.


Recent Random Post: