
34 ఏళ్ల తర్వాత తిరిగి థియేటర్లలో విడుదలైన ఆదిత్య 369 కొత్త సాంకేతిక హంగులతో ప్రేక్షకులను అలరించనుంది. నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ ఈ రీ-రిలీజ్ ప్రమోషన్లను ప్రత్యేకంగా నిర్వహించింది. సినిమా కథలో కీలకమైన టైమ్ మెషీన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసి హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
టీవీ, యూట్యూబ్, ఓటీటీల్లో ఉచితంగా అందుబాటులో ఉన్న పాత సినిమాకు ఇంత భారీ ప్రమోషన్ చేయడం అరుదైన విషయమే. కానీ 4K రెజల్యూషన్‌తో రీ-రిలీజ్ కావడంతో అభిమానుల్లో మంచి ఉత్సాహం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్వయంగా హీరో నందమూరి బాలకృష్ణ హాజరై మరింత హైప్ తీసుకొచ్చారు. గతంలో సింహాద్రి రీ-రిలీజ్ ఈవెంట్ జరిగినా, జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాలేదు. కానీ ఆదిత్య 369 ఈ విషయంలోనూ ప్రత్యేకతను సాధించింది.
ఈ సినిమా ప్రమోషన్ కోసం పోస్టర్లు, ట్రైలర్, సోషల్ మీడియా క్యాంపెయిన్‌తో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఇంటర్వ్యూలు కూడా సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఇప్పటి టీనేజ్ కుర్రాళ్లు, 30s లో ఉన్న యువత ఈ సినిమాను థియేటర్లలో చూడలేకపోయారు. వారికీ ఇది స్క్రీన్‌పై ఆస్వాదించడానికి అద్భుతమైన అవకాశం.
భారతదేశంలోనే మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ మూవీగా గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య 369 లో బాలకృష్ణ డ్యూయల్ రోల్, ఇళయరాజా అద్భుతమైన బీజీఎం, అమ్రిష్ పూరి పవర్‌ఫుల్ విలనీ, తెలుగు తెరకు అపరిచితమైన కాలయంత్రమ్ కాన్సెప్ట్ – ఇవన్నీ ప్రేక్షకులను థ్రిల్ చేశాయి. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్‌లో దీనికి ప్రత్యేక స్థానం కల్పిస్తారు.
ఈ సైన్స్ ఫిక్షన్ క్లాసిక్‌కు సీక్వెల్‌గా ఆదిత్య 999 తెరకెక్కిస్తామని బాలకృష్ణ ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపారు. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది స్వీయ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పుడైనా ఆదిత్య 369 థియేటర్లో చూసి అసలు అనుభూతిని ఆస్వాదించండి.
Recent Random Post:















