సాయి ధరమ్ తేజ్ కొత్త క్రేజీ కాంబో సెట్!

Share


మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈసారి భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న “సంబరాల యేటిగట్టు” సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్ నెలకొంది. నూతన దర్శకుడు రోహిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విశేషమైన స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా, ఆమె పాత్ర కూడా కథలో బలమైన ఇంపాక్ట్ కలిగించేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, సంబరాల యేటిగట్టు పూర్తవగానే తేజ్ మరో క్రేజీ కాంబినేషన్‌ను లాక్ చేశాడట. “క” సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శక ద్వయం సందీప్–సుజిత్ లతో తేజ్ కొత్త సినిమా చేయబోతున్నాడని టాక్. ఇప్పటికే స్టోరీ డిస్కషన్లు ముగిశాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం. ఈ సారి తేజ్ కోసం ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌పై ఈ దర్శక ద్వయం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట.

“క” సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ జంట దర్శకులు, ఈసారి మరింత విభిన్నమైన కథతో సర్‌ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ లెవెల్ ట్రీట్మెంట్‌తో ఈ ప్రాజెక్ట్ రూపొందించబోతున్నారని తెలుస్తోంది. బ్రో తర్వాత తేజ్ కొంత గ్యాప్ తీసుకుని ఎంచుకున్న ఈ రెండు సినిమాలు ఆయన కెరీర్‌లో కీలకమైన టర్నింగ్ పాయింట్ అవుతాయనే అంచనాలు ఉన్నాయి.

సంబరాల యేటిగట్టు రిలీజ్‌కి సిద్ధమవుతుండగా, వెంటనే సందీప్–సుజిత్ దర్శకత్వంలో తేజ్ సినిమా మొదలవుతుందని సమాచారం. ఈ కొత్త ప్రాజెక్ట్‌లో తేజ్ మరోసారి యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్‌లతో కూడిన థ్రిల్లింగ్ జర్నీని ఆడియన్స్‌కి అందించబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలు ప్రకటించనున్నారు.


Recent Random Post: