
ఒకప్పుడు బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనోద్దంటానా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌తో టాలీవుడ్లో స్టార్‌గా నిలిచే అవకాశం ఉన్న సిద్దార్థ్, వరుసగా వచ్చిన ఫ్లాపులతో తెలుగు నుంచి దూరమై తమిళంలో స్థిరపడిపోయాడు. మహా సముద్రంతో రీ ఎంట్రీ ఇచ్చినా, ఆ సినిమా పరాజయంతో అతని రీ ఎంట్రీ అసలేం ఉపయోగపడలేదు. అయితే డబ్బింగ్ చిత్రాల ద్వారా క్రమం తప్పకుండా తెలుగు ప్రేక్షకులను పలకరించేవాడిగా కొనసాగిన సిద్దార్థ్, ఇప్పుడు 3BHK అనే సినిమాతో జూలై 4న మళ్లీ టాలీవుడ్‌ను టెస్ట్ చేయబోతున్నాడు.
తన స్టేట్మెంట్లతో తరచూ చర్చకు దారితీసే సిద్దూ, తాజాగా 3BHK ప్రమోషన్ ఈవెంట్లో కూడా ఓ కాంట్రవర్సీ మాట చెప్పాడు. “ఎవరికో డబ్బులు రావాలనే ఉద్దేశంతో నేను సినిమాలు చేయను. మీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను” అంటూ వ్యాఖ్యానించాడు. కానీ ఇక్కడ అతను మౌలిక లాజిక్ ఒకటి మిస్ అయ్యాడు.
ఏ ఆర్టిస్టైనా పాత్రల పట్ల ఎంతగా సంతృప్తిగా ఉన్నా, ఫైనల్‌గా నిర్మాతకు లాభం రావాల్సిందే. ప్రేక్షకులు నటనను మెచ్చుకోవచ్చు. విమర్శకులు ప్రశంసించొచ్చు. కానీ అవన్నీ థియేటర్ వసూళ్లకు మారకపోతే, నిర్మాత పెట్టిన డబ్బు నష్టం అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే, నటుడిగా కాదు కనీసం సహజ్ఞానంతో చూసినా, నిర్మాతకు డబ్బులు రావాలి అనే ఆలోచన ఏ నటుడికైనా ఉండాల్సిందే. “ఎవరికో డబ్బులు రావడానికి చేయను” అన్న మాట, ప్రాక్టికల్ లెవెల్లో అసంబద్ధంగా వినిపిస్తుంది.
ఇంకా, ఒక మీడియా ప్రతినిధి “చిన్న సినిమా” అన్నందుకు సిద్దార్థ్ అసహనం వ్యక్తం చేశాడు. “చిన్న పెద్ద భేదం ఉండదు. బడ్జెట్ ఆధారంగా కాదు, కంటెంట్ ఆధారంగా సినిమా విలువ నిర్ణయించాలి” అన్నాడు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే, ప్యాన్ ఇండియా సినిమాలు వందల కోట్లు ఖర్చు చేసి తీయబడుతాయి. అవి, రెండు మూడు కోట్లతో తీయబడే చిన్న సినిమాలతో ఎలా సమానం అవుతాయి? బడ్జెట్, మార్కెట్, వసూళ్లు అన్నీ భిన్నంగా ఉంటాయి.
ప్రస్తుతం సిద్దార్థ్ చేస్తున్న 3BHK ఓ మీడియం రేంజ్ సినిమా. ఎంత బాగా వచ్చినా అది పుష్ప లాంటి సినిమాల్లా వెయ్యి కోట్లు వసూలు చేయదు. వంద కోట్ల మార్క్ అందుకోవడమే గరిష్ఠం. కాబట్టి చిన్నా – పెద్దా అనే విభజనను కేవలం భావోద్వేగంతో కొట్టిపారేయడం తప్పు. విషయాన్ని వ్యాపార కోణంలో చూస్తే, వాస్తవాలు తేటతెల్లంగా కనిపిస్తాయి.
Recent Random Post:















