
ఈ శుక్రవారం రీ-రిస్కెడ్ కాబోతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు రాంగ్ టైమింగ్ అనుకున్నప్పటికీ, అనూహ్య స్పందన కనిపిస్తోంది. ఇంటర్ పరీక్షలు, ఇతర తరగతుల వార్షిక పరీక్షలు జరుగుతుండటంతో కలెక్షన్లు భారీగా ఉండవేమోనని మహేష్ బాబు & వెంకటేష్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, వారి అంచనాలకు పూర్తి భిన్నంగా, బుక్ మై షో లో రోజుకు 15,000 – 20,000 టికెట్లు అడ్వాన్స్ గా అమ్ముడవుతున్నాయి. ఇది కేవలం ఒక్క యాప్ లో నమోదైన డేటా మాత్రమే!
ఇంకా విశేషమేంటంటే, మార్చి 7న విడుదల కాబోతున్న ఇంకెన్నో కొత్త సినిమాల కంటే ఈ రీ-రిస్కెడ్ సినిమాకే భారీగా బుకింగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా “ఛావా” తెలుగు డబ్బింగ్ సినిమా మీద సిరిమల్లె చెట్టు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాన థియేటర్లలో ఫ్యాన్స్ తెగ బుకింగ్స్ చేస్తూ హడావుడి చేస్తున్నారు. హైదరాబాద్ సుదర్శన్, విశ్వనాథ్ వంటి సింగిల్ స్క్రీన్లలో తొలి రోజే నాలుగు షోలు సాల్డ్ అవుట్ అయ్యాయి. మల్టీప్లెక్సుల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ వేగంగా నడుస్తున్నాయి.
గతేడాది మురారి రీ-రిస్కెడ్ కు వచ్చిన స్పందనను మించిన రేంజ్లో సిరిమల్లె చెట్టు రీ-రిస్కెడ్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇదే బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోవడం సినిమాకు కలిసొచ్చే అంశం. కొత్త సినిమాల కంటే మొదటి రోజే చూడాలనే ఉత్సుకత సిరిమల్లె చెట్టుకు ఎక్కువగా కనిపిస్తోంది. టాక్ & రివ్యూలు ఆధారపడి జనాలు వెళ్లే పరిస్థితి కొత్త సినిమాలకు ఉండగా, ఈ రీ-రిస్కెడ్ మూవీకి అలాంటి అవసరం లేదు.
15 ఏళ్ల క్రితం బిగ్ స్క్రీన్‌పై చూసిన క్లాసిక్ మళ్లీ థియేటర్లలో వచ్చే అవకాశం వస్తే ఆడియన్స్ వదులుకుంటారా? ఇకపై మహేష్ బాబు సినిమాలను స్క్రీన్ మీద చూసే అవకాశం కొద్దికాలం పాటు లేకపోవడం, మరోవైపు సంక్రాంతికి ఘన విజయం అందుకున్న వెంకటేష్ ఫ్యాన్స్ ఈ మూడ్‌లో ఉండటంతో, మార్చి 7న థియేటర్లలో రేంజ్ సందడి గ్యారెంటీ!
Recent Random Post:















