
వర్ధమాన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 34 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుని దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశారు. అతడి మృతి ఇప్పటికీ బాలీవుడ్‌ను వెంటాడుతోంది. ప్రతిభావంతుడైన సుశాంత్‌కు అవకాసాలు కల్పించకుండా, ఇండస్ట్రీలోని కొందరు “గ్రూప్ పాలిటిక్స్”తో అతడిపై కుట్రలు చేశారన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసాయి. ఇండస్ట్రీలో “ఇన్‌సైడర్స్” మరియు “ఔట్‌సైడర్స్” వ్యవహారంపై అప్పటి నుంచి ఇప్పటికీ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇప్పుడు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అమాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపుతున్నాయి. “సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాంటి మంచి మనిషిని కోల్పోయాం. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ పరిస్థితి కూడా అలానే ఉందని భయమేస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. కార్తీక్‌కి వ్యతిరేకంగా బాలీవుడ్‌లో కొందరు ఒక గ్రూప్‌లా ఏర్పడి కుట్రలు చేస్తున్నారని, అదే విధంగా కొనసాగితే ఎప్పటికైనా అతను కూడా సుశాంత్ లాగే ఒక నిర్ణయం తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కార్తీక్ ఆర్యన్ తల్లిదండ్రుల మద్దతుతో పరిశ్రమలో స్థిరపడిన ప్రతిభావంతుడని, తన నవ్వుతోనే ఎదురవుతున్న కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడని అమాల్ అన్నారు. సుశాంత్ విషయంలో కూడా ఆయన్ని చుట్టుముట్టినవాళ్లే అతడిని మానసికంగా నాశనం చేశారని, అదే పరిస్థితి కార్తీక్‌కూ కలుగకూడదని తన ఆందోళనను వ్యక్తం చేశారు.
అయితే ఆశ్చర్యకరంగా, ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే కరణ్ జోహార్‌తో ఉన్న విభేదాలు పరిష్కరించుకుని, అతడితో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులలో భాగంగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో అమాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
అయితే కార్తీక్‌పై కుట్రలు చేస్తున్న వారు ఎవరన్న విషయాన్ని మాత్రం అమాల్ మాలిక్ వివరించలేదు. అయినా ఆయన చేసిన హెచ్చరికలు బాలీవుడ్ ఇండస్ట్రీలో నెలకొన్న అసహజ వాతావరణాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాయి.
Recent Random Post:















